టాలీవుడ్ 2026.. పాన్ ఇండియా నామస్మరణ.. గూస్‌బంప్స్ మోతే..?
1. రాజా సాబ్ :
2026 సంక్రాంతి బరిలో వస్తున్న ఈ చిత్రంపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. ప్రభాస్ వంటి మాస్ ఇమేజ్ ఉన్న హీరో, హారర్-కామెడీ జానర్‌లో నటించడం ఇదే తొలిసారి. మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ట్రైలర్ ఇప్పటికే పాజిటివ్ వైబ్స్‌ను తీసుకొచ్చింది. ప్రభాస్ పాత వింటేజ్ లుక్స్ మళ్ళీ కనిపిస్తుండటంతో, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ ఓపెనింగ్స్ సాధించడం ఖాయంగా కనిపిస్తోంది.
2. ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్: ‘డ్రాగన్’
‘కేజీఎఫ్’, ‘సలార్’ వంటి చిత్రాలతో సంచలనం సృష్టించిన ప్రశాంత్ నీల్, గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్‌తో కలిసి చేస్తున్న ఈ ప్రాజెక్టుకు ‘డ్రాగన్’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. వేసవి విడుదలకు ప్లాన్ చేస్తున్నప్పటికీ, నీల్ మార్క్ మేకింగ్ కోసం కొంత సమయం పట్టవచ్చు. ఎన్టీఆర్ మాస్ పవర్ మరియు నీల్ విజువల్స్ కలిస్తే బాక్సాఫీస్ రికార్డులు తిరగరాయడం ఖాయం.
3. రామ్ చరణ్ – బుచ్చిబాబు: ‘పెద్ది’
రామ్ చరణ్ – బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వస్తున్న ‘పెద్ది’ చిత్రానికి ఇప్పటికే ‘చికిరి చికిరి’ సాంగ్ వల్ల నేషనల్ వైడ్ క్రేజ్ వచ్చింది. క్రీడా నేపథ్యం ఉన్న ఈ చిత్రంపై బాలీవుడ్ బయ్యర్లు భారీ ఆఫర్లు కురిపిస్తున్నారు. చరణ్ నటనలో మరో కొత్త కోణాన్ని ఈ సినిమా చూపిస్తుందని అంచనా.
4. ప్రభాస్ ‘ఫౌజీ’ & ‘స్పిరిట్’
2026లో ప్రభాస్ నుంచి కనీసం రెండు సినిమాలు ఉండేలా movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. హను రాఘవపూడి దర్శకత్వంలో యుద్ధ నేపథ్యంతో వస్తున్న ‘ఫౌజీ’ విజువల్ వండర్‌గా ఉండబోతోంది. అలాగే, డిసెంబర్ నాటికి సందీప్ రెడ్డి వంగా ‘స్పిరిట్’ వస్తుందని ప్రచారం జరుగుతోంది. ఈ రెండు చిత్రాలు ప్రభాస్ ప్యాన్ ఇండియా స్టామినాను మరో స్థాయికి తీసుకెళ్లనున్నాయి.
5. విశ్వంభర :
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఈ సోషియో ఫాంటసీ చిత్రం విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో ఎక్కడా తగ్గకూడదని నిర్ణయించుకుంది. గ్రాఫిక్స్ పనులు పూర్తయిన తర్వాతే అధికారిక తేదీని ప్రకటించనున్నారు.
స్వయంభు: నిఖిల్ సిద్ధార్థ్ కెరీర్‌లో ‘కార్తికేయ 2’ను మించిన పీరియాడిక్ అడ్వెంచర్‌గా ‘స్వయంభు’ మేకింగ్ వీడియోతోనే అందరినీ ఆశ్చర్యపరిచింది.
నాని ‘ది ప్యారడైజ్’, బాలకృష్ణ – గోపీచంద్ మలినేనిల ‘NBK 111’ కూడా ప్యాన్ ఇండియా అప్పీల్‌తో సిద్ధమవుతున్నాయి. ఈ సినిమాలన్నీ అనుకున్న సమయానికి విడుదలైన పక్షంలో, 2026 టాలీవుడ్ చరిత్రలోనే అత్యధిక వసూళ్లు సాధించిన సంవత్సరంగా నిలిచిపోతుంది అనడంలో సందేహం లేదు.