టాలీవుడ్ థియేటర్లలో జనాలున్నా ట్విస్ట్ వేరే ఉందే...?
కొత్త సినిమాల పరిస్థితి - నీరసించిన ఓపెనింగ్స్ :
ఈ ఏడాది తొలి రోజే సైక్ సిద్ధార్థ్, వనవీర, 45, మార్క్, నీలకంఠ, గత వైభవం, మదం వంటి ఆరేడు సినిమాలు విడుదలయ్యాయి. ఈ సినిమాల్లో 'నందు' బృందం చేసిన ప్రమోషన్ల వల్ల 'ఏ' సెంటర్లలో కొంతవరకు ప్రేక్షకులు కనిపించారు. మిగిలిన సినిమాలన్నీ కనీస ఆక్యుపెన్సీ కోసం కష్టపడుతున్నాయి. ప్రేక్షకులను ఆకట్టుకునే బలమైన కంటెంట్ లేకపోవడమే ఇందుకు కారణమని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
పాత సినిమాల జోరు - అనూహ్యమైన పికప్ :
కొత్త సినిమాలు నిరాశపరిచిన చోట, రెండో వారంలో ఉన్న సినిమాలు అదరగొడుతున్నాయి. శంబాల ఆది సాయికుమార్ నటించిన ఈ చిత్రం రెండో వారంలోకి అడుగుపెట్టినా, ఇవాళ అనూహ్యంగా పుంజుకుంది. బుక్ మై షో ట్రెండింగ్‌లో గంట గంటకూ బుకింగ్స్ పెరుగుతుండటం విశేషం. బాలకృష్ణ నటిస్తున్న ఈ చిత్రం 'తాండవం' మళ్లీ పుంజుకుంది. ముఖ్యంగా తెలంగాణలో టికెట్ ధరలు తగ్గించడం ఈ సినిమాకు ప్లస్ అయ్యింది. ఫ్యామిలీ ఆడియన్స్ మళ్లీ ఈ సినిమా వైపు మొగ్గు చూపుతున్నారు. దురంధర్ నాలుగో వారంలోనూ ప్రతిరోజూ నాలుగు షోలతో దూసుకుపోతున్న ఈ చిత్రం అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. లాంగ్ రన్ లో ఈ సినిమా బయ్యర్లకు కాసుల వర్షం కురిపిస్తోంది.
ఈషా, ఛాంపియన్: ఈ రెండు సినిమాలు కూడా డీసెంట్ టర్న్ అవుట్స్‌తో తమ పట్టును నిరూపించుకుంటున్నాయి. కొత్త సినిమాల కంటే రీ-రిలీజ్ అయిన పాత సినిమాలకు యువత బ్రహ్మరథం పడుతోంది. జల్సా పవన్ కళ్యాణ్ అభిమానులు 'జల్సా' రీ-రిలీజ్‌ను పండుగలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. థియేటర్ల వద్ద సందడి మామూలుగా లేదు. నువ్వు నాకు నచ్చావ్ సినిమాకు మార్నింగ్ షోల నుంచే భారీ స్పందన కనిపించింది. వెంకటేష్ కామెడీ టైమింగ్ మళ్లీ థియేటర్లలో నవ్వులు పూయిస్తోంది. మహేష్ బాబు 'మురారి' కూడా ఓకే అనిపించుకుంటూ తన వంతు వసూళ్లను రాబట్టుకుంటోంది.
ముందున్నది పండగ సీజన్ :
ఈ వారం గడిస్తే చాలు, బాక్సాఫీస్ వద్ద ప్రభాస్ ‘రాజా సాబ్’ తో సంక్రాంతి సందడి అధికారికంగా మొదలవుతుంది. అందుకే ఈలోగా తమ వద్ద ఉన్న సినిమాలతో వీలైనంత ఎక్కువ రాబట్టుకోవాలని బయ్యర్లు ప్లాన్ చేస్తున్నారు. ఈ వీకెండ్ కూడా ఇదే ట్రెండ్ కొనసాగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మొత్తానికి 2026 నూతన సంవత్సరం బాక్సాఫీస్‌కు మిశ్రమ ఫలితాలను ఇచ్చింది. కొత్త సినిమాలకు ఆదరణ లభించకపోయినా, పాత సినిమాలు మరియు రీ-రిలీజ్ సినిమాలతో థియేటర్ యాజమాన్యాలు ఊపిరి పీల్చుకున్నాయి.