స్టార్ హీరోయిన్ తో ఛాన్స్ కొట్టేసిన రాజు వెడ్స్ రాంబాయి హీరో..?

Divya
హీరో అఖిల్ రాజ్ అంటే గుర్తుపట్టకపోవచ్చు కానీ.. రాజు వెడ్స్ రాంబాయి చిత్రంలో రాజు అంటే మాత్రం ప్రతి ఒక్కరు గుర్తుపట్టేస్తారు. అంతలా ఆ చిత్రంలో తన నటనతో బాగా ఆకట్టుకున్నారు ఈ కుర్ర హీరో. ఈ సినిమాలో ఎమోషనల్ గా నటించి తన సత్తా చూపించిన అఖిల్ రాజ్.. ఈ సినిమా విడుదలకు ముందు పలు రకాల షార్ట్ ఫిలిమ్స్ లో కూడా నటించారు. కానీ రాజు వెడ్స్ రాంబాయి సినిమాని టర్నింగ్ పాయింట్ అయ్యింది. ఇటీవల వచ్చిన ఈషా సినిమాతో కూడా మరో విజయాన్ని అందుకున్నారు అఖిల్ రాజ్. దీంతో ఈ కుర్ర హీరోకి వరుస అవకాశాలు క్యూ కడుతున్నాయి



తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఒక క్రేజీ ఆఫర్ కి ఓకే చెప్పినట్లుగా వినిపిస్తున్నాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ చేస్తున్న ఒక బడా చిత్రంలో నటించే అవకాశం దక్కించుకున్నారు. అయితే ఇక్కడ మరొక విషయం ఏమిటంటే ఈ చిత్రంలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా నటించబోతున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. కుర్ర హీరో అఖిల్ రాజ్ కు ఇది ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. అనుపమ వంటి స్టార్ హీరోయిన్ తో నటించే అవకాశం అంటే కెరియర్ టర్నింగ్ పాయింట్ అని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.


మరి ఈ సినిమా విషయానికి వస్తే డైరెక్టర్ పేరు వినిపించలేదు కానీ ,స్టోరీ పరంగా అటు అనుపమ, అఖిల్ రాజ్ ఇద్దరు కూడా ఓకే చెప్పినట్లుగా వినిపిస్తున్నాయి. ఈ చిత్రం ప్యూర్ ఎమోషనల్ బ్యాక్ డ్రాప్ లో రాబోతోంది. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి అధికారికంగా ప్రకటన వెలుపడే అవకాశం ఉంది. అన్ని కుదిరితే వచ్చే ఏడాది సమ్మర్గ్ ఈ సినిమాని రిలీజ్ చేసే విధంగా చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది. మరి ఈ జోడి పై ఎవరు క్లారిటీ ఇస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: