మొత్తానికి కూలీ సినిమా ఫ్లాప్ పై.. నోరువిప్పిన లోకేష్..!

Divya
తమిళ సినీ పరిశ్రమలో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా పేరు సంపాదించిన వారిలో లోకేష్ కనకరాజు కూడ ఒకరు. స్టార్ హీరోలతో వరుస సినిమాలు చేస్తూ మంచి విజయాలను తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకున్న లోకేష్ కనకరాజు ఇప్పటివరకు మొత్తం 5 చిత్రాలను తెరకెక్కించారు. అందులో మూడు సినిమాలు బ్లాక్ బాస్టర్ విజయం కాగ మరో రెండు చిత్రాలు యావరేజ్ గా నిలిచాయి. అతి తక్కువ సమయంలోనే కోలీవుడ్లో స్టార్ డైరెక్టర్ గా పేరు సంపాదించిన లోకేష్ అటు హీరోగా కూడా అలరించేందుకు సిద్ధమయ్యారు. లోకేష్ కానకరాజ్ తెరకెక్కించిన కూలి సినిమా డిజాస్టర్ పై స్పందించారు.





లోకేష్ కనకరాజు, సూపర్ స్టార్ రజినీకాంత్ కాంబినేషన్లో కూలీ సినిమా అనౌన్స్మెంట్ చేసినప్పటి నుంచి భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అలా భారీ అంచనాల మధ్య కూలీ సినిమా ఈ ఏడాది ఆగస్టులో విడుదలయ్యింది. ఈ చిత్రంలో నాగార్జున, శృతిహాసన్, సత్యరాజ్, ఉపేంద్ర, అమీర్ ఖాన్ తో  పాటుగా మరి కొంతమంది నటీనటులు నటించారు. అయితే ఈ సినిమా విడుదల సమయంలో చాలానే విమర్శలు కూడా వినిపించాయి. తాజాగా అ విషయం పైన లోకేష్ మాట్లాడుతూ కూలీ సినిమా పైన ఎన్నో విమర్శలు వచ్చాయి.. దీంతో తన తదుపరి సినిమాలో సరిచేసుకుని ప్రయత్నం చేస్తాను.. నా పైన ట్రోల్స్ వచ్చినప్పటికీ జనాలు మాత్రం రజనీకాంత్ కోసమే సినిమా చూశారని, అలా ఆ సినిమాకి రూ .500 కోట్లు వచ్చాయని నిర్మాతలు చెప్పడంతో ఆనందపడ్డానని తెలిపారు.


అందుకు ప్రేక్షకులకు కూడా తాను ధన్యవాదాలు చెప్పాలని.. తాను ఎప్పుడూ కూడా అంచనాల మీద కథలు రాసుకోలేదని రాసుకున్న కథలలోని పాత్రలు ఆడియన్స్ కి నచ్చితేనే తనకి కూడా ఆనందమని తెలిపారు. ఒకవేళ అలా అందుకో లేకపోతే, అ తర్వాత  చిత్రం అందుకోవడానికైనా ట్రై చేస్తూ ఉంటానని తెలిపారు లోకేష్. తన దర్శకత్వం నుంచి తదుపరి సినిమా పై త్వరలోనే  అధికారికంగా ప్రకటన రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: