ఏంటి సమంత రెండో పెళ్లి కోసం అంతకు తెగించిందా.. అసలు సమంత మనిషేనా.. ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుంది..అంటూ కొంతమంది నెటీజన్లు సమంతని సోషల్ మీడియా వేదికగా ఏకీపారేస్తున్నారు. మామూలుగానే సమంత విడాకులు తీసుకున్న తర్వాత చాలామందికి శత్రువుగా మారిపోయింది. ఆమె ఎక్కడ కనిపించినా చాలు ఆమెపై నెగటివ్ కామెంట్లే టార్గెట్ గా చేస్తూ ఉంటారు. అంతేకాదు ఆమె ప్రమోషన్ల సమయంలో పాస్ట్ గురించి చెప్పి కన్నీళ్లు పెట్టుకున్న సమయంలో కూడా ఫేక్ కన్నీళ్లు,దొంగ ఏడుపు అంటూ నిందించారు. అయితే అలాంటి సమంత చాలా రోజుల తర్వాత హ్యాపీగా ఉంది. దానికి కారణం రాజ్ నిడిమోరుతో డేటింగ్ చేయడమే. ఇక కొద్ది రోజులు ఇద్దరు ఒకరిని ఒకరు అర్థం చేసుకొని ఫైనల్ గా ఈ ఏడాది డిసెంబర్ 1న కుటుంబ సభ్యుల మధ్యలో అధికారికంగా పెళ్లి చేసుకున్నారు.
అయితే తాజాగా సమంత రెండవ పెళ్లికి సంబంధించిన ఎన్నో ఫోటోలు కూడా చక్కర్లు కొట్టాయి. ఈ నేపథ్యంలోనే కొంతమంది నెటిజన్స్ ఇదేంటి సమంత మతం మార్చుకుందా..రెండో పెళ్లి కోసం అలా చేసిందా.. అంటూ చాలామంది డౌట్ పడుతున్నారు.అయితే సమంత క్రిస్టియన్ అనే సంగతి మనకు తెలిసిందే. కానీ నాగచైతన్యని పెళ్లి చేసుకున్న సమయంలో నాగచైతన్య హిందూ కాబట్టి మొదట హిందూ సాంప్రదాయంలో పెళ్లి చేసుకొని ఆ తర్వాత క్రిస్టియన్ సాంప్రదాయంలో కూడా పెళ్లి చేసుకుంది. కానీ వీరి విడాకుల తర్వాత సమంత రెండో పెళ్లి చేసుకున్న సమయంలో భూత శుద్ధ పద్ధతిలో పెళ్లాడింది.అయితే ఒక రకంగా ఇది హిందువులకు సంబంధించిన సాంప్రదాయమే అని తెలుస్తుంది. కానీ సమంత తన రెండో పెళ్లి కోసం క్రిస్టియన్ పద్ధతిని అస్సలు ఫాలో కాలేదు. అంతే కాకుండా చాలా రోజుల నుండి సమంత సద్గురుని దేవుడిగా భావిస్తోంది.గుళ్ళు గోపురాలు అంటూ తిరుగుతోంది.
ఆధ్యాత్మికం వైపు అడుగులు వేయడంతో చాలామంది నెటిజన్లు సమంత క్రిస్టియన్ మతాన్ని వదిలేసి హిందూమతంలో కలిసిపోయింది అనే ప్రచారం చేస్తున్నారు. అంతే కాదు రెండో పెళ్లి కోసం సమంత ఇంతకు తెగించిందా అంటూ మాట్లాడుకుంటున్నారు. కానీ చాలా మంది సమంత అభిమానులు మాత్రం సమంత మతం మారింది అనడానికి ఎలాంటి ప్రూఫ్స్ లేవు.కానీ సమంత ఆధ్యాత్మికం వైపు మళ్లడానికి ప్రధాన కారణం డిప్రెషన్.. విడాకుల తర్వాత డిప్రెషన్ లోకి వెళ్లిన సమంత ఆ డిప్రెషన్ నుండి బయట పడడం కోసమే ఈషా యోగ సెంటర్, సద్గురుని కలవడం వంటివి చేసింది.అలా ఆధ్యాత్మికం వైపు మళ్ళితే తన ఆలోచనలు రిఫ్రెష్ అవుతాయని, డిప్రెషన్ నుండి బయట పడుతుందనే కారణంతోనే అలా చేసింది. అంతేగాని సమంత మతం మారలేదు అంటూ కౌంటర్లు ఇస్తున్నారు.