ఇట్లు మీ ఎదవ మూవీ రివ్యూ & రేటింగ్!
ఈ మధ్య కాలంలో చిన్న సినిమాలు సైతం అద్భుతమైన కంటెంట్ తో తెరకెక్కుతూ ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి. త్రినాథ్ కఠారి హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఇట్లు మీ ఎదవ ఈరోజు థియేటర్లలో రిలీజ్ కాగా ఈ సినిమాకు సంబంధించి నిన్న ప్రీమియర్స్ ప్రదర్శితమయ్యాయి. సాహితీ అవాంచ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించగా సంజీవని ప్రొడక్షన్స్ బ్యానర్ పై బళ్లారి శంకర్ నిర్మాతగా ఈ సినిమా తెరకెక్కింది. యూత్ ను ఆకట్టుకునే టైటిల్ తో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను ఏ మేరకు అందుకుందో ఇప్పుడు చూద్దాం.
కథ :
శ్రీను (త్రినాథ్ కఠారి) ఆరు సంవత్సరాలుగా పీజీ చదువుతూ ఆవారాగా టైం వేస్ట్ చేస్తుంటాడు. శ్రీను చదివే కాలేజ్ లోనే జాయిన్ అయిన మనస్విని (సాహితీ అవాంచ)ని చూసి శ్రీను ప్రేమలో పడతాడు. మనస్విని మొదట శ్రీనుపై ఇష్టం చూపించకపోయినా తర్వాత రోజుల్లో ఆమె కూడా ప్రేమలో పడుతుంది. శ్రీను తండ్రి (గోపరాజు రమణ) కొడుకు ప్రేమలో పడటంతో మారతాడని సంతోషించడంతో పాటు మనస్విని తండ్రిని (దేవీప్రసాద్) ని కలిసి పెళ్లి సంబంధం గురించి మాట్లాడతాడు.
ఈ సమస్య ఒక డాక్టర్ దృష్టికి వెళ్లగా ముప్పై రోజులు శ్రీను మనస్విని ఇంట్లో ఉండాలని ఆ సమయంలో శ్రీను మంచోడు అనిపించుకోవాలని అలా జరిగితే మాత్రమే శ్రీను, మనస్విని పెళ్లి జరుగుతుందని షరతు విధిస్తాడు. మరి ఈ ఛాలెంజ్ లో శ్రీను గెలిచాడా? చివరకు ఏమైంది? ఈ 30 రోజుల ఛాలెంజ్ లో శ్రీనుకు ఎదురైనా అవాంతరాలు ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా.
విశ్లేషణ :
త్రినాథ్ కఠారి ఒకవైపు హీరోగా మరోవైపు దర్శకుడిగా రెండు పడవల ప్రయాణం చేసినా రెండింటికీ న్యాయం చేశాడు. తనికెళ్ళ భరణి డాక్టర్ రోల్ లో కనిపించింది కొన్ని నిమిషాలే అయినా ఆయన పాత్ర కూడా ఆకట్టుకునేలా ఉంది. ఆర్పీ పట్నాయక్ ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ కాగా ఆయన మ్యూజిక్, బీజీఎం బాగున్నాయి. బొమ్మరిల్లు సినిమాకు రివర్స్ స్క్రీన్ ప్లేతో ఈ సినిమా తెరకెక్కింది. కొన్ని సన్నివేశాలు రొటీన్ గా అనిపించినా ప్రేక్షకులను మెప్పించేలా ఉన్నాయి.
హీరోయిన్ సాహితీ అవాంచ నటన బాగుంది. ఈ వీకెండ్ కు మంచి కామెడీ సినిమా చూడాలనే వాళ్లకు ఈ సినిమా మంచి ఛాయిస్ అవుతుంది. సినిమాకు ఖర్చు విషయంలో ఎక్కడా రాజీ పడలేదు. టెక్నీకల్ గా కూడా ఈ సినిమా స్ట్రాంగ్ గా ఉంది. ఈ సినిమాలో డైలాగ్స్ సైతం బాగున్నాయి. హీరోయిన్ పాత్రను ట్రెడిషనల్ గా చూపించడం ఈ సినిమాకు ప్లస్ అయింది.
ప్లస్ పాయింట్స్ : త్రినాథ్ కఠారి నటన, కామెడీ, కొన్ని ట్విస్టులు
మైనస్ పాయింట్ : రొటీన్ స్టోరీ లైన్
రేటింగ్ : 2.5/5.0