మెగా
పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ది అని సినిమాలో హీరోగా నటిస్తున్నాడు.
జాన్వి కపూర్ ఈ
మూవీ లో హీరోయిన్గా నటిస్తూ ఉండగా ... బుచ్చిబాబు
సనా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఏ ఆర్ రెహమాన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తూ ఉండగా ...
శివరాజ్ కుమార్ , జగపతి బాబు , దివ్యాందు ఈ
మూవీ లో కీలక పాత్రలలో కనిపించనున్నారు. ఈ సినిమాను వచ్చే సంవత్సరం
మార్చి 27 వ తేదీన విడుదల చేనున్నట్లు ఈ
మూవీ బృందం వారు చాలా రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించారు. ఇప్పటికే ఈ
మూవీ నుండి మేకర్స్ కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేశారు. వాటికి అద్భుతమైన రెస్పాన్స్ జనాల నుండి లభించింది. కొన్ని రోజుల క్రితం ఈ
మూవీ బృందం వారు ఈ
సినిమా నుండి చిక్రీ చిక్రీ అంటూ సాగే మొదటి పాటను విడుదల చేశారు. ఈ సాంగ్ కి విడుదల అయిన తర్వాత ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ రావడం మొదలు అయింది.
ఈ సాంగ్ను మొత్తంగా తెలుగు ,
తమిళ్ ,
కన్నడ , మలయాళ ,
హిందీ భాషల్లో విడుదల చేశారు. ఇక ఐదు భాషల్లో కలిపి ఇప్పటివరకు ఈ సినిమాకు 80 ప్లస్ మిలియన్ వ్యూస్ దక్కాయి. ఇలా పెద్ది
మూవీ లోని చిక్రీ చిక్రీ సాంగ్ కి అత్యంత తక్కువ రోజుల్లోనే ఏకంగా 80 ప్లస్ మిలియన్ వ్యూస్ వచ్చాయి. దీనితోనే అర్థమవుతుంది ఈ సాంగ్ కి ఏ రేంజ్ రెస్పాన్స్ ప్రేక్షకుల నుండి లభిస్తుంది అనేది. మరి కొంత కాలం లోనే ఈ
మూవీ బృందం వారు ఈ
సినిమా రెండవ సాంగ్ ను కూడా విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్లు , అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా మరికొన్ని రోజుల్లోనే విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ
మూవీ రెండవ సాంగ్ కూడా ప్రేక్షకుల్లో భారీ అంచనాలునెలకొనే అవకాశం చాలా వరకు ఉంది అని అనేక మంది అభిప్రాయ పడుతున్నారు.