ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ నెల చివరి వరకు ఈ
మూవీ షూటింగ్ మొత్తం కంప్లీట్ కానున్నట్లు
డిసెంబర్ నెల నుండి ఈ
మూవీ ప్రమోషన్లను మొదలు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను వచ్చే సంవత్సరం
సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయనున్నట్లు ఈ
మూవీ బృందం వారు అధికారికంగా ప్రకటించారు. కొన్ని రోజుల క్రితమే ఈ
సినిమా నుండి
మూవీ బృందం వారు మీసాల పిల్ల అంటూ సాగే పాటను విడుదల చేశారు. ఈ సాంగ్ కి అద్భుతమైన రెస్పాన్స్ జనాల నుండి లభిస్తుంది. తాజాగా ఈ సాంగ్
యూట్యూబ్ లో 50 మిలియన్ న్యూస్ను అందుకుంది.
ఇలా సైలెంట్ గా ఈ
మూవీ లోని మీసాల పిల్ల సాంగ్ అద్భుతమైన వ్యూస్ ను దక్కించుకుంటూ ముందుకు దూసుకు వెళుతుంది. ఈ
మూవీ కి బీమ్స్ సిసిరిలియో సంగీతం అందించాడు.
చిరంజీవి హీరో గా నటిస్తున్న
మూవీ కావడం , ఇప్పటివరకు దర్శకత్వం వహించిన ప్రతి సినిమాతో మంచి విజయం అందుకున్న
అనిల్ రావిపూడి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తూ ఉండడంతో మన శంకర వర
ప్రసాద్ గారు సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. మరి ఈ
సినిమా ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో తెలియాలి అంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.