హీరోయిన్ అవ్వకుండానే.. యాడ్ లో అదరగొట్టేస్తున్న ఘట్టమనేని వారసురాలు..!
మొదటిసారిగా జాన్వీ స్వరూప్ జువెలరీ యాడ్ కు సంబంధించి కనిపించింది. జువెలరీ బ్రాండ్ టీమ్ సోషల్ మీడియా వేదికగా జాన్వీ ఫోటోలను చూసి ఆమె అప్రోచ్ అయినట్లుగా తెలుస్తోంది. ఈ మధ్యనే జాన్వీ పుట్టినరోజు సందర్భంగా హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతుందని అధికారికంగా ఫోటోలతో షేర్ చేశారు. హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వకముందే బ్రాండ్ యాడ్ ప్రమోట్ చేయడం ఇప్పుడు ఆసక్తికరమైన విషయని చెప్పవచ్చు. త్వరలోనే జాన్వీ ఒక బడా ప్రాజెక్టులో కూడా భాగం కాబోతున్నట్లు ప్రచారం అయితే ఇప్పుడు జరుగుతోంది. ఇప్పటికే సినిమాకు సంబంధించి స్టోరీ లాక్ చేశారని త్వరలోనే అధికారికంగా ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్లు వినిపిస్తోంది.
జాన్వీ స్వరూప్ నటన, డాన్సులో ప్రత్యేకించి మరి శిక్షణ పొందినట్లుగా తెలుస్తోంది. జాన్వీ స్వరూప్ తల్లి మంజుల ఘట్టమనేని కూడా సినీ ఇండస్ట్రీలో దర్శకురాలిగా మంచి పేరు సంపాదించింది. సినిమాలకు కొంత మేరకు దూరంగా ఉన్నప్పటికీ తన కూతురిని ప్రోత్సహించడంలో మాత్రం వెనుకడుగు వేయడం లేదు ఘట్టమనేని మంజుల. మరి జాన్వీ సినిమాలలోకి ఎంట్రీ ఎలాంటి సినిమాతో ఉంటుంది? ఏ హీరోతో ఉంటుందనే విషయంపై ఘట్టమనేని అభిమానులు చాలా ఎక్సైటింగ్ గానే ఎదురుచూస్తున్నారు. జాన్వీనే కాకుండా గతంలో మహేష్ బాబు కూతురు ,ఇటీవల నందమూరి బాలకృష్ణ కుమార్తె తేజస్విని కూడా జువెలరీ యాడ్ కి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించారు.