టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి సూపర్ స్టార్ మహేష్ బాబు తన కెరియర్ లో ఎన్నో సినిమాలను వదులుకున్నాడు. అలా మహేష్ వదులుకున్న సినిమాలలో కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాలను కూడా అందుకున్నాయి. ఇకపోతే మహేష్ వదులుకున్న ఓ సినిమా ఏకంగా టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. మరి మహేష్ వదులుకున్న ఆ సినిమా ఏది ..? ఏ కారణంతో మహేష్ ఆ మూవీ ని రిజెక్ట్ చేశాడు అనే వివరాలను తెలుసుకుందాం.
చాలా సంవత్సరాల క్రితం తరుణ్ హీరో గా రీచా హీరోయిన్గా నువ్వే కావాలి అనే సినిమా రూపొందిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ కి విజయ భాస్కర్ దర్శకత్వం వహించగా ... త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాకు మాటలను అందించాడు. ఈ మూవీ అదిరిపోయే రేంజ్ టాక్ ను తెచ్చుకొని అద్భుతమైన కలెక్షన్లను వసూలు చేసి ఆ సమయంలో ఏకంగా టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్గా నిలిచింది.
మొదట విజయ భాస్కర్ ఈ సినిమాను తరుణ్ తో కాకుండా మహేష్ బాబు తో చేయాలి అని అనుకున్నాడట. అందులో భాగంగా మహేష్ బాబు ను కలిసి ఈ మూవీ కథను కూడా వివరించాడట. కథ మొత్తం విన్న మహేష్ బాబు కొన్ని కారణాల వల్ల ఆ సమయంలో ఆ సినిమా చేయలేను అని చెప్పాడట. దానితో విజయ భాస్కర్ ఆ తర్వాత తరుణ్ ను కలిసి నువ్వే కావాలి మూవీ కథను వివరించాడట. ఇక తరుణ్ కి ఈ మూవీ కథ బాగా నచ్చడంతో వెంటనే ఆ సినిమాలో హీరో గా నటించడానికి ఒప్పుకున్నాడట. ఇక తరుణ్ తో నువ్వే కావాలి అనే టైటిల్ తో విజయ భాస్కర్ ఆ సినిమాను రూపొందించగా ఆ మూవీ టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. అలా మహేష్ బాబు రిజెక్ట్ చేసిన మూవీ లో తరుణ్ హీరోగా నటించి ఏకంగా టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ నే అందుకున్నట్లు తెలుస్తోంది.