తెలుగు స్టేట్స్ లో "ఓజి"కి సూపర్ కలెక్షన్స్.. కానీ ఆ ఒక్క ఏరియాలోనే బ్రేక్ ఈవెన్..?

Pulgam Srinivas
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా ఓజి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్గా నటించగా ... సుజిత్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. డి వి వి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై v v DANAIAH' target='_blank' title='డి వి వి దానయ్య-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">డి వి వి దానయ్య ఈ సినిమాను నిర్మించాడు. ఇమ్రాన్ హష్మీ ఈ సినిమాలో విలన్ పాత్రలో నటించగా ... శ్రేయ రెడ్డి , ప్రకాష్ రాజ్ , అర్జున్ దాస్ ఈ మూవీ లో ముఖ్య పాత్రలలో నటించారు. ఈ మూవీ విడుదలకు ముందు ఈ సినిమా నుండి మేకర్స్ విడుదల చేసిన ప్రచార చిత్రాలు అదిరిపోయి రేంజ్ లో ఉండడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో అంచనాలు తారా స్థాయికి చేరిపోయాయి. దానితో ఈ మూవీ కి సూపర్ సాలిడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ రెండు తెలుగు రాష్ట్రాల్లో జరిగింది. ఈ మూవీ కి విడుదల అయిన తర్వాత మంచి టాక్ కూడా వచ్చింది. దానితో ఈ సినిమా అద్భుతమైన కలెక్షన్లను కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో వసూలు చేసింది.


ఈ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి కలెక్షన్లను వసూలు చేసిన చాలా ప్రాంతాలలో ఈ మూవీ బ్రేక్ ఫార్ములాను కంప్లీట్ చేసుకోలేకపోయింది అని తెలుస్తుంది. అందుకు ప్రధాన కారణం ఈ మూవీ కి విడుదల అయిన తర్వాత మంచి టాక్ వచ్చిన , ఈ మూవీ కి అద్భుతమైన కలెక్షన్లు వచ్చినా కూడా ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉండడంతో ఈ మూవీ యొక్క ఫ్రీ రిలీజ్ బిజినెస్ భారీ స్థాయిలో జరిగింది అని , దానితో ఈ మూవీ చాలా ఏరియాలో జరుపుకున్న ప్రీ రిలీజ్ బిజినెస్ స్థాయి కలెక్షన్లను వసూలు చేయలేక పోయింది అని , దానితో ఈ మూవీ చాలా ప్రాంతాల్లో బ్రేక్ ఈవెన్ ఫార్ములాను కంప్లీట్ చేసుకోలేదు అని తెలుస్తుంది. ఇక ఈ మూవీ కి నైజాం ఏరియాలో 54 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా ... ఈ ఏరియాలో 57 కోట్ల షేర్ షేర్ కలెక్షన్లను వసూలు చేసి మూడు కోట్ల లాభాలను కూడా అందుకున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: