తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన స్థాయికి చేరుకున్న తర్వాత హిందీ సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన వారు అనేక మంది ఉన్నారు. అలా టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపును సంపాదించుకున్న తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన వారిలో చాలా తక్కువ మంది మాత్రమే సక్సెస్ అయ్యారు. ఇక టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపును సంపాదించుకున్నాక బాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ అద్భుతమైన విజయాలను అందుకొని స్టార్ హీరోయిన్ స్థాయికి చేరుకున్న వారిలో తాప్సి ఒకరు. ఈమె మంచు మనోజ్ హీరోగా దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందిన ఝుమ్మంది నాదం అనే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి మంచి విజయాన్ని , మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఆ తర్వాత కూడా ఈమె అనేక సినిమాలలో నటించి టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన స్థాయికి చేరుకుంది.
అలా తెలుగు లో మంచి స్థాయికి చేరుకున్న తర్వాత ఈమె హిందీ సినిమాలపై ఫోకస్ పెట్టడం మొదలు పెట్టింది. అందులో భాగంగా ఈమె కు హిందీ లో మంచి అవకాశాలు దక్కాయి. అలాగే ఈమె నటించిన చాలా సినిమాలు మంచి విజయాలు సాధించడంతో అత్యంత తక్కువ కాలం లోనే ఈ బ్యూటీ బాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ స్థాయి కి చేరుకుంది. ఇక బాలీవుడ్ ఇండస్ట్రీ లో కెరియర్ను మొదలు పెట్టిన తక్కువ కాలం లోనే మంచి గుర్తింపును సంపాదించుకున్న ఈమె అదే రేంజ్ లో కేరిర్ను చాలా సంవత్సరాల పాటు ముందుకు సాగించింది. కొంత కాలం క్రితం ఈమె షారుఖ్ ఖాన్ హీరో గా రూపొందిన డంకి అనే సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ ద్వారా కూడా తాప్సీ కి మంచి గుర్తింపు వచ్చింది. ఇలా హిందీ లో అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న ఈమె ప్రస్తుతం పర్వాలేదు అనే రేంజ్ ఉన్న సినిమాలలో నటిస్తూ మంచి దశలో కెరియర్ను ముందుకు సాగిస్తుంది.