చిన్న రీజన్ తో స్టార్ హీరో సినిమాలో హీరోయిన్ ఛాన్స్ మిస్ అయింది.. కట్ చేస్తే అలాంటి పరిస్థితి..?

Pulgam Srinivas
సినిమా ఇండస్ట్రీ లో కొంత మంది హీరోయిన్లకు అదిరిపోయే రేంజ్ అవకాశాలు చేతి వరకు అచ్చే మిస్ అవుతూ ఉంటాయి. అలా మిస్ అయిన సినిమా స్టార్ హీరోతో అయినా , అదే సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ విజయం అందుకున్న ఆ మూవీ లో మేము నటించి ఉండుంటే బాగుండేది , మా కెరియర్ అద్భుతమైన స్థాయికి చేరుకునేది అని ముద్దుగుమ్మలు అనుకోవడం చాలా సర్వసాధారణం. ఇక ఇలాంటి అవకాశాన్నే మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటిమని అయినటువంటి అనుపమ పరమేశ్వరన్ మిస్ చేసుకుంది. అసలు విషయం లోకి వెళితే ... కొన్ని సంవత్సరాల క్రితం టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి రామ్ చరణ్ టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరు అయినటువంటి సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన రంగస్థలం అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో సమంత హీరోయిన్గా నటించింది. ఈ మూవీ అదిరిపోయే రేంజ్ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మూవీ ద్వారా సమంత కు నటిగా మంచి గుర్తింపు వచ్చింది.


ఇకపోతే ఒకానొక ఈవెంట్లో భాగంగా ఈ సినిమా దర్శకుడు అయినటువంటి సుకుమార్ మాట్లాడుతూ  ... రంగస్థలం మూవీ లో మొదటగా సమంత బదులు హీరోయిన్గా అనుపమ ను అనుకున్నాం. అందులో భాగంగా ఆమెతో ఆడిషన్ కూడా చేశాం. కానీ ఆడిషన్ జరుగుతున్న సమయం లో ఆమె చాలా సార్లు వాళ్ళ అమ్మ వైపు చూసింది. దానితో ఆమె కాస్త భయపడుతుందేమో అనుకొని ఆ సినిమాలో మేము హీరోయిన్ గా అనుపమ ను తీసుకోలేదు అని దర్శకుడు సుకుమార్ చెప్పుకొచ్చాడు. ఈ విషయం సుకుమార్ చెప్పడంతో చాలా మంది రంగస్థలం సినిమాలో గనుక ఈమె హీరోయిన్ గా నటించి ఉంటుంటే స్టార్ హీరోయిన్ అయ్యేది అనే అభిప్రాయాలను చాలా మంది వ్యక్తం చేశారు. ప్రస్తుతం అనుపమ మంచి క్రేజ్ ఉన్న సినిమాలలో నటిస్తూ అద్భుతమైన జోష్ లో కెరియర్ను ముందుకు సాగిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: