కిరణ్ నుండి ఈ రేంజ్ ఎక్స్పెక్ట్ చేసి ఉండరు.. మామూలు హిట్ కొట్టలేదుగా..?

Pulgam Srinivas
టాలీవుడ్ యువ నటుడు కిరణ్ అబ్బవరం తాజాగా కే ర్యాంప్ అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ కొన్ని రోజుల క్రితమే విడుదల అయింది. ఈ సినిమాకు విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే ఈ మూవీ పక్క రొటీన్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ అని , ఈ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకోవడం అత్యంత కష్టం అనే రేంజ్ లో రివ్యూ లు వచ్చాయి. దానితో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్యూర్ అవుతుంది అని చాలా మంది అనుకున్నారు. కానీ ఈ మూవీ మాత్రం అదిరిపోయే రేంజ్ కలెక్షన్లను వసూలు చేసి ఇప్పటికే భారీ లాభాలను కూడా అందుకొని బాక్సా ఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ విజయాన్ని సొంతం చేసుకోండి. ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన 13 రోజుల బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయింది. ఈ 13 రోజుల్లో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా ఏ ఏరియాలో ఏ రేంజ్ కలెక్షన్లు వచ్చాయి. మొత్తంగా ఎన్ని కనెక్షన్లు వచ్చాయి. ఈ సినిమా ఎన్ని కోట్ల లాభాలను అందుకొని బ్లాక్ బాస్టర్ గా నిలిచింది అనే వివరాలను క్లియర్ గా తెలుసుకుందాం.

13 రోజుల్లో ఈ సినిమాకు నైజాం ఏరియాలో 4.08 కోట్ల కలెక్షన్లు దక్కగా , సీడెడ్ లో 1.99 కోట్లు , ఆంధ్ర లో 4.88 కోట్ల కలెక్షన్లు దక్కాయి. కర్ణాటక , రెస్ట్ ఆఫ్ ఇండియాలో కలుపుకొని ఈ సినిమాకు 1.5 కోట్ల కలెక్షన్లు దక్కగా , ఓవర్సీస్ లో 1.35 కోట్ల కలెక్షన్లు దక్కాయి. ప్రపంచ వ్యాప్తంగా 13 రోజుల్లో ఈ సినిమాకు 13.45 కోట్ల షేర్ ... 24.65 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 8.15 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరగగా ... ఈ మూవీ 9 కోట్ల టార్గెట్ తో బాక్సా ఫీస్ బరిలోకి దిగింది. ఇప్పటివరకు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 4.5 కోట్ల లాభాలను అందుకొని బ్లాక్ బాస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: