తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ దర్శకుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో శ్రీకాంత్ ఓదెల ఒకరు. ఈయన నాని హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్గా రూపొందిన దసరా అనే మూవీ తో దర్శకుడిగా కెరియర్ను మొదలు పెట్టాడు. ఈ మూవీ మంచి విజయం సాధించడంతో ఈయనకు దర్శకుడిగా మంచి గుర్తింపు ఏర్పడింది. ఈ సినిమా తర్వాత ఈయన మరోసారి నాని హీరోగా సినిమా చేస్తున్నాడు. నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ప్రస్తుతం ది ప్యారడైజ్ అనే సినిమా రూపొందుతుంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కూడా కొంత భాగం పూర్తయింది. ఈ మూవీ లో మోహన్ బాబు ఒ కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా మేకర్స్ ఇప్పటికే విడుదల చేశారు.
ఈ సినిమాలో హీరోయిన్గా ఎవరు నటించబోతున్నారు అనే దానిపై మాత్రం మేకర్స్ ఇప్పటివరకు క్లారిటీ ఇవ్వలేదు. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ హాటెస్ట్ బ్యూటీ ఖయాదు లోహర్ ను హీరోయిన్గా మేకర్స్ ఫైనల్ చేసినట్లు , అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా మరి కొన్ని రోజుల్లోనే ఈ మూవీ బృందం వారు విడుదల చేయనున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఈమె తెలుగులో చాలా కాలం క్రితం శ్రీ విష్ణు హీరో గా రూపొందిన అల్లూరి అనే మూవీ లో హీరోయిన్గా నటించింది. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయ్యింది. మరి ది ప్యారడైజ్ మూవీ లో ఈమె హీరోయిన్గా సెలెక్ట్ అయితే ఈ తెలుగు సినిమాతో ఎలాంటి విజయాన్ని ఈ బ్యూటీ అందుకుంటుందో చూడాలి. ప్రస్తుతం కయాదు లోహాద్ కి యూత్ లో మంచి క్రేజ్ ఉంది. మరి ఈ సినిమాలో ఈమెకు ఆఫర్ దక్కితే ఈ మూవీ ద్వారా ఈమెకు ఎలాంటి గుర్తింపు దక్కుతుందో చూడాలి.