రజనీకి అప్పుడు జరిగినట్లే మళ్లీ జరగదుగా.. ఫ్యాన్స్ లో టెన్షన్ మొదలైందిగా..?

Pulgam Srinivas
సూపర్ స్టార్ రజనీ కాంత్ ప్రస్తుతం జైలర్ 2 అనే సినిమాలో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికి తెలిసిందే. కొంత కాలం క్రితం రజనీ కాంత్ , నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన జైలర్ అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే రేంజ్ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో ఈ మూవీ కి కొనసాగింపుగా జైలర్ 2 మూవీ ని రూపొందించనున్నట్లు ప్రకటించారు. జైలర్ 2 మూవీ కి కూడా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇకపోతే జైలర్ 2 మూవీ లో టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి నందమూరి నటసింహం బాలకృష్ణ ఓ కీలకమైన పాత్రలో కనిపించనున్నట్లు , ఈయన పాత్ర నిడివి కూడా ఈ సినిమాలో చాలా ఎక్కువగానే ఉండనున్నట్లు వార్తలు వచ్చాయి. దానితో ఈ సినిమాపై తెలుగు ప్రేక్షకుల్లో అంచనాలు తార స్థాయికి చేరాయి.


కానీ ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం కొన్ని రోజుల క్రితమే నెల్సన్ , బాలకృష్ణ ను కలిసి ఈ మూవీ కథను అందులోని ఆయన పాత్రను వివరించినట్లు ఆది బాలయ్య కు నచ్చకపోవడంతో ఆయన ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకోలేదు అని ఓ వార్త వైరల్ అవుతుంది. అలా బాలయ్య "జైలర్ 2" మూవీ లోని పాత్రకు రిజెక్ట్ చేయడంతో బాలయ్య కోసం అనుకున్న పాత్రలో నెల్సన్ మలయాళ నటుడు అయినటువంటి పహాద్ ఫాసిల్ ను తీసుకున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది . కొంత కాలం క్రితం రజనీ కాంత్ "వెట్టాయన్"  అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ సినిమాలో ఫహద్ ఫాజిల్ నటించాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. దానితో పహాద్ ఫాజిల్ "జైలర్ 2" లో నటించబోతున్నాడు అనే వార్త వైరల్ కావడంతో  ఈ మూవీ రిజల్ట్ ఏమవుతుందో అని రజని అభిమానులు కాస్త కంగారు పడుతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: