పెద్ది ఫస్ట్ సాంగ్ విడుదల అయ్యేది ఆ తేదీనే..?

Pulgam Srinivas
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా గేమ్ చెంజర్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా భారీ అంచనాల నడుమ విడుదల అయినప్పటికీ ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో విఫలం అయింది. దానితో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ అపజయాన్ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం చరణ్ , బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రూపొందుతున్న పెద్ది అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు.


జాన్వీ కపూర్ ఈ మూవీ లో హీరోయిన్గా నటిస్తూ ఉండగా ... జగపతి బాబు , శివ రాజ్ కుమార్ , దివ్యాంధు ఈ మూవీ లో కీలక పాత్రలలో కనిపించనున్నారు. ఏ ఆర్ రెహమాన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. రెహమాన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తూ ఉండడంతో ఈ మూవీ మ్యూజిక్ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాను వచ్చే సంవత్సరం మార్చి 27 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. ఈ మూవీ కి సంబంధించిన మొదటి సింగిల్ను మరికొన్ని రోజుల్లోనే మేకర్స్ విడుదల చేయాలి అని చూస్తున్నట్లు తెలుస్తోంది.


ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ కి సంబంధించిన మొదటి పాటను నవంబర్ 8 వ తేదీన విడుదల చేయాలి అని ఆలోచనకు మేకర్స్ వచ్చినట్లు మరికొన్ని రోజుల్లోనే అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా విడుదల చేయనున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ప్రస్తుతానికి ఈ మూవీ యొక్క మొదటి సాంగ్ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. మరి ఈ మూవీ మొదటి సాంగ్ ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. వృద్ధి సినిమాస్ , మైత్రి సంస్థ , సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ వారు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: