' అఖండ 2 ' కు థ‌మ‌న్ విశ్వ‌రూపం అరాచ‌కం చూపించేశాడా... ?

RAMAKRISHNA S.S.
- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

నందమూరి బాలకృష్ణ హీరోగా, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న అతి ప్రతిష్టాత్మక సినిమా అఖండ 2: తాండవం పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. మొదటి భాగం అఖండ ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించగా, ఇప్పుడు దానికి సీక్వెల్‌గా వస్తున్న ఈ సినిమా భారీ క‌న్వాస్‌తో తెర‌కెక్కుతోంది. ఈసారి కథా నిర్మాణం, సాంకేతిక నైపుణ్యం, సంగీతం అన్నీ హై లెవెల్‌లో ఉండబోతున్నాయని సినిమా యూనిట్‌ చెబుతోంది. ప్రస్తుతం చిత్రీకరణ శరవేగంగా కొనసాగుతుండగా, సంగీత దర్శకుడు థమన్ తన మ్యూజిక్‌తో మరోసారి మాయ చేయబోతున్నాడు. అఖండ 2 లో థమన్ ప్రత్యేక శ్రద్ధతో దైవత్వాన్ని ప్రతిబింబించే రీతిలో పాటలను రూపొందిస్తున్నార‌ట‌.


ఇటీవలే ఆయన సంస్కృత సాహిత్యం కోసం మిశ్రా సోదరులతో కలిసి పనిచేసి, ఆ తర్వాత ప్రముఖ క్లాసికల్ సింగర్స్ సర్వేపల్లి సిస్టర్స్‌తో కొత్త భక్తి గీతాలపై వర్క్ చేస్తున్నట్టు తెలిపారు. సర్వేపల్లి సిస్టర్స్ గానం, థమన్ కంపోజిషన్, బోయపాటి విజన్.. అన్నీ క‌లిసి ఈ సినిమాను మ‌రో లెవ‌ల్‌కు తీసుకెళ్లబోతున్నాయి. ఈసారి పాటల్లో భక్తి భావం, ఎనర్జీ, ఎమోషన్ సమపాళ్లలో మేళవించబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. అఖండ మొదటి భాగంలో “ జై బాలయ్య ”, “ అఖండానంద ” వంటి పాటలు ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. అయితే అఖండ 2 లో థమన్ వాటికంటే ఇంకా పవర్‌ఫుల్, డివైన్ మ్యూజిక్ ఇవ్వాలని కసరత్తు చేస్తున్నాడు.


సాహిత్యం పరంగా కూడా టీమ్ ఎక్కడా తగ్గకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. సంస్కృత పదాలతో కూడిన దైవీయ లిరిక్స్, శక్తి ఆరాధన నేపథ్యం కలిగిన ట్యూన్స్ ఈ సినిమా ఆడియోని ప్రత్యేకంగా నిలబెడతాయి. మొత్తానికి, అఖండ 2: తాండవం మ్యూజిక్ ఆల్బమ్‌నే కాదు, మొత్తం సినీ అనుభూతినే భక్తి మరియు మాస్ ఎనర్జీ కలయికగా ప్రేక్షకులకు అందించబోతోందని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: