కాంతార వర్సెస్ కొత్త లోక.. ఈ సినిమాలలో ఓటీటీ విజేత ఎవరు?

Reddy P Rajasekhar

ఈ మధ్య కాలంలో భారీ బడ్జెట్ సినిమాలకు థియేటర్లలో కంటే ఓటీటీలలో మంచి రెస్పాన్స్ వస్తున్న సంగతి తెలిసిందే. కాంతార చాప్టర్1 ఈ నెల 31వ తేదీన  అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కు రానుంది.  థియేటర్లలో ఈ సినిమాను చూడటం మిస్ అయిన వాళ్ళు.  ఈ సినిమా చూసి నచ్చిన వాళ్ళు ఓటీటీలో ఈ సినిమాను మళ్ళీ చూసే అవకాశం అయితే ఉందని చెప్పవచ్చు.  కాంతార చాప్టర్1 కు ఓటీటీలో మంచి రెస్పాన్స్ వచ్చే ఛాన్స్ ఉంది.

కాంతార చాప్టర్1 మూవీ  కలెక్షన్ల పరంగా సంచలనాలు సృషించింది.  అమెజాన్ ప్రైమ్ కు ఈ సినిమాకు కచ్చితంగా ప్లస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. హోంబలే  ఫిలిమ్స్ నిర్మాతలకు ఈ సినిమాతో మళ్ళీ భారీ లాభాలు  వచ్చాయి. కేవలం 125 కోట్ల రూపాయల బడ్జెట్ తో  తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చేసిన మ్యాజిక్ గురించి ఎంత చెప్పినా తక్కువేనని చెప్పవచ్చు.

మరోవైపు మలయాళ మూవీ  కొత్త లోక  కూడా థియేటర్లలో అద్భుతాలు చేసింది.  30 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 300 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్  కలెక్షన్లను  సాధించింది. ఈ సినిమా కూడా  ఈ నెల 31వ తేదీన జియో ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది.  సౌత్ ఇండియాలో ఈ రెండు సినిమాలు సృష్టించిన సంచలనాలు అన్నీఇన్నీ కావని చెప్పవచ్చు.

కాంతార వర్సెస్ కొత్త లోక ఓటీటీ పోటీ గురించి ప్రస్తుతం జోరుగా  చర్చ జరుగుతోంది. ఈ రెండు సినిమాలు ఓటీటీలలో రికార్డులు క్రియేట్ చేస్తే  మరిన్ని కొత్త తరహా సినిమాలు తెరకెక్కే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమాలకు సీక్వెల్స్ లేదా ప్రిక్వెల్స్  తెరకెక్కే అవకాశాలు ఉన్నాయి.  కాంతార వర్సెస్ కొత్త లోక ఓటీటీలలో ఏ స్థాయిలో వ్యూస్ ను సొంతం చేసుకుంటుందో చూడాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: