తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన గుర్తింపు కలిగిన హీరోలలో మాస్ మహారాజా రవితేజ ఒకరు. రవితేజ కొన్ని సంవత్సరాల క్రితం నటించిన సినిమాలు చాలా వరకు మంచి విజయాలను అందుకున్నాయి. కానీ ఈ మధ్య కాలంలో రవితేజ నటించిన సినిమాలు చాలా వరకు బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొడుకు వస్తున్నాయి. రవితేజ కు ఆఖరి విజయం దక్కి కూడా చాలా కాలమే అవుతుంది. తాజాగా రవితేజ "మాస్ జాతర" అనే సినిమాలో హీరో గా నటించాడు. శ్రీ లీల ఈ మూవీ లో హీరోయిన్గా నటించింది.
ఈ మూవీ ని మరికొన్ని రోజుల్లోనే విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ బృందం వారు తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను విడుదల చేశారు. ఆ ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన కొన్ని పాటలను కూడా ఈ మొవు్ బృందం వారు విడుదల చేశారు. ఈ మూవీ బృందం వారు రవితేజ పూర్వపు సినిమాలపై బాగా కాన్సన్ట్రేషన్ పెట్టినట్లు అర్థం అవుతుంది. రవితేజ హీరోగా నటించిన ఇడియట్ మూవీ లోని చూపుల్తో గుచ్చి గుచ్చి అనే సినిమాకు సంబంధించిన ట్యూన్ ను ఈ సినిమాలోని ఒక పాటకు వాడారు. ఈ మూవీ బృందం వారు ఇప్పటికే ఆ లిరికల్ వీడియో సాంగ్ను కూడా మేకర్స్ విడుదల చేశారు. దానికి మంచి రెస్పాన్స్ జనాల నుండి లభించింది. ఇకపోతే రవితేజ కొన్ని సంవత్సరాల క్రితం వెంకీ అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో స్నేహ హీరోయిన్గా నటించగా ... శ్రీను వైట్ల ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు.
ఈ మూవీ లో రవితేజ , స్నేహ మధ్య వచ్చే ఒక సన్నివేశానికి సంబంధించిన డైలాగ్ ను మాస్ జాతర మూవీ ట్రైలర్ లో చూపించారు. ఈ సన్నివేశానికి కూడా ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు. ఇలా రవితేజ నటించిన సినిమాలలోని అద్భుతమైన పాటలను , సన్నివేశాలను ఈ మూవీ లో బాగానే వాడినట్లు తెలుస్తోంది. దానితో ప్రస్తుతం రవితేజ అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నట్లు తెలుస్తోంది.మరి రవితేజ కు ఈ మూవీ తో ఎలాంటి విజయం దక్కుతుందో తెలియాలి అంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.