ఆ సినిమాలో డ్యూయల్ రోల్ లో నితిన్.. బ్లాక్ బస్టర్ ఖాతాలో చేరడం ఖాయమా?

Reddy P Rajasekhar

టాలీవుడ్ హీరోలలో ఒకరైన నితిన్ గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ మధ్య కాలంలో నితిన్ నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్లుగా నిలిచాయి. రాబిన్ హుడ్, తమ్ముడు సినిమాలతో నితిన్ కు భారీ షాకులు తగిలాయి. ఈ రెండు సినిమాలు నిర్మాతలకు భారీ నష్టాలను మిగిల్చాయి. అయితే నితిన్ కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం అందుతోంది.

నితిన్ వీఐ ఆనంద్ కాంబినేషన్ లో ఈ సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది.  చిట్టూరి శ్రీను  ఈ సినిమాను నిర్మించనున్నారు. ఈ సినిమాలో నితిన్ డ్యూయల్ రోల్ లో నటించనున్నారు.  నితిన్ కెరీర్ కు కమర్షియల్ సక్సెస్ కీలకం కాగా ఈ సినిమాతో ఆ  లోటు తీరుతుందేమో చూడాల్సి ఉంది.  త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయి.
 
నితిన్ ప్రస్తుతం ఎంచుకునే ప్రాజెక్ట్స్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గతంతో  పోలిస్తే నితిన్ పారితోషికం కూడా తగ్గిందని తెలుస్తోంది.  నితిన్ నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లను ఎంచుకుంటే ఈ హీరో ఖాతాలో బ్లాక్ బస్టర్ హిట్లు చేరతాయని చెప్పడంలో సందేహం అవసరం లేదు.  నితిన్ వేణు కాంబినేషన్ లో తెరకెక్కాల్సిన ఎల్లమ్మ సినిమా కూడా  ఆగిపోయిన సంగతి తెలిసిందే.

పరిమిత బడ్జెట్ లో సినిమాలను నిర్మించేలా ప్లాన్ చేసుకుంటే నితిన్ కు కెరీర్ పరంగా ఇబ్బందులు ఉండవని చెప్పవచ్చు.  నితిన్  ఇతర భాషల్లో  సైతం సక్సెస్ సాధించేలా కెరీర్ ను ప్లాన్ చేసుకుంటే బాగుంటుందని  అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి.  నితిన్ పాన్ ఇండియా  సినిమాల్లో  నటిస్తే కెరీర్ పరంగా మరింత ఎదుగుతారని చెప్పవచ్చు. నితిన్ కెరీర్ ప్లానింగ్ ఎలా ఉండనుందో  చూడాల్సి ఉంది.  ఈ సినిమా సక్సెస్ సాధిస్తే మాత్రమే నితిన్ కొత్త ప్రాజెక్ట్స్ గురించి క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: