తమన్నా మా కడుపు కొడుతోంది.. ఆమె వల్ల మా ఆఫర్స్ అన్ని పోతున్నాయి.. ఐదు లక్షలు ఇస్తే ఆ పని కూడా చేస్తుంది అంటూ స్టార్ హీరోయిన్ తమన్నా పై మరో హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు చేసింది.మరి ఇంతకీ తమన్నా పై ఇలాంటి కామెంట్లు చేసిన ఆ హీరోయిన్ ఎవరు? ఎందుకు ఆమె కడుపు మండిపోతుంది అనేది ఇప్పుడు చూద్దాం.. హీరోయిన్ గా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న తమన్నా ప్రస్తుతం హీరోయిన్ రోల్స్ రాకపోవడంతో ఐటెం సాంగ్స్ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. తెలుగు, తమిళ,హిందీ ఏ భాషలో ఐటమ్ సాంగ్ ఆఫర్ వచ్చినా కూడా వదిలి వేయకుండా రెమ్యూనరేషన్ తక్కువైనా సరే చేసేస్తోంది. అలా ఏం చేసినా సరే ఇండస్ట్రీలో రాణించాలి అనుకుంటుంది. అయితే అలాంటి తమన్నా పై తాజాగా బాలీవుడ్ హీరోయిన్ రాఖీ సావంత్ మండిపడింది..
రాఖీసావంత్ తమన్నా గురించి మాట్లాడుతూ.. తమన్నాపై నాకు ఎలాంటి కోపం లేదు.అలాగే ఆమె వల్ల నాకు ఎలాంటి ప్రాబ్లము లేదు. కానీ తమన్నా మా కడుపు కొడుతోంది. ఎందుకంటే ఒకప్పుడు కోట్లు తీసుకొని సినిమాల్లో హీరోయిన్ గా స్టార్డం అందుకున్న తమన్నా ఇప్పుడు కేవలం ఐదు, పది లక్షల కోసం స్పెషల్ సాంగ్స్ ఎందుకు చేస్తోంది.ఒక్కో సినిమాకు కోట్ల రెమ్యూనరేషన్ తీసుకునే తమన్నా 5 లక్షల కోసం ఎందుకు ఐటమ్ సాంగ్ చేస్తోంది. ఈ విషయంలో తమన్నా మా కడుపు కొడుతున్నట్టే..
ఒకరకంగా తమన్నా విలువలు పాటించడం లేదు విలువలు లేకుండా ఉండకూడదు అంటూ తమన్నా పై విమర్శలు చేస్తూనే మరోవైపు తమన్నా ఐటెం సాంగ్స్ చేయడం వల్ల నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు అని చెప్పుకొచ్చింది. దాంతో రాఖీసావంత్ మాట్లాడిన మాటలు నెట్టింట వైరల్ గా మారడంతో చాలామంది తమన్నా ఫ్యాన్స్ మీకు ఆమెతో ప్రాబ్లం లేనప్పుడు మళ్ళీ ఆమెపై ఎందుకు విరుచుకుపడుతున్నారు.. తమన్నా వల్ల మీకు వచ్చే ఆఫర్స్ ఆమెకే వెళ్ళిపోతున్నాయని మీ బాధ..అది డైరెక్ట్ గా చెప్పకుండా ఈ కడుపు మంట ఎందుకు అంటూ కామెంట్లు పెడుతున్నారు.