సినిమా
ఇండస్ట్రీ లో ఒక హిట్ కొట్టాలి అంటే కథ ఎంత ముఖ్యమో స్క్రీన్ ప్లే అంత కంటే ముఖ్యం అని వాదించే వారు కూడా చాలా మంది ఉన్నారు. ఎందుకు అంటే కథలు అనేవి ఎప్పటికప్పుడు కొత్తవి రాయడం అనేది చాలా కష్టమైన పని. అదే కథ పాతది అయినప్పటికీ స్క్రీన్ ప్లే ను సరి కొత్తగా రాసినట్లయితే ఒకే
జోనర్ సినిమాలతో కూడా అద్భుతమైన విజయాలను అందుకోవచ్చు అని చాలా మంది చెబుతూ ఉంటారు. ఇకపోతే ఓ దర్శకుడు దాదాపు ఒకే రకమైన కథలతో కొన్ని సినిమాలను రూపొందించి అందులో మూడు సినిమాలతో ఏకంగా
టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ లను అందుకున్నాడు. ఇంతకు ఆ టాలెంటెడ్
డైరెక్టర్ ఎవరు అనుకుంటున్నారా ..? ఆయన మరెవరో కాదు బి గోపాల్.