టాలీవుడ్
యువ దర్శకుడు
సుజిత్ తాజాగా
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఓజి అనే
మూవీ ని రూపొందించిన విషయం మన అందరికి తెలిసిందే. ఈ
మూవీ లో పవన్ కి జోడిగా
ప్రియాంక అరుల్
మోహన్ నటించగా ... ఈ
సినిమా సెప్టెంబర్ 25 వ తేదీన విడుదల అయ్యి మంచి విజయం సాధించింది. ఈ
మూవీ విడుదల అయిన తర్వాత
సుజిత్ మరియు ఓజి
మూవీ ని నిర్మించిన దానయ్య కు సంబంధించి కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి.
ఓజి
మూవీ నిర్మాత అయినటువంటి దానయ్య ఈ
సినిమా చివరి దశకు చేరే సమయానికి ఆర్థిక కష్టాలను ఎదుర్కొన్నట్లు , దానితో
సినిమా చేయలేని పరిస్థితికి వచ్చినట్లు , ఇక
సినిమా ఆపివేయడం ఇష్టం లేని
సుజిత్ తన సొంత డబ్బు ఆరు కోట్లు పెట్టి ఈ
సినిమా మిగిలిన భాగం షూటింగు ను పూర్తి చేసినట్లు , ఆ తర్వాత ఆ లెక్కల విషయంలో
సుజిత్ , దానయ్య మధ్య విభేదాలు వచ్చినట్లు వార్తలు వచ్చాయి. అలాగే
సుజిత్ ,
నాని దర్శకత్వంలో తన తదుపరి
సినిమా చేయనున్నాడు. ఓజి
సినిమా చిత్రీకరణ దశలో ఉన్న సమయంలో
నాని ,
సుజిత్ కాంబో
మూవీ ని కూడా దానయ్య నిర్మించనున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ఆ తర్వాత ఈ కాంబో
మూవీ చేతులు మారింది.
వేరే
నిర్మాత ఈ సినిమాను చిత్రీకరించబోతున్నాడు. దానితో ఓజి
మూవీ విభేదాల వల్లే
సుజిత్ , దానయ్య బ్యానర్లో కాకుండా
నాని సినిమాను వేరే బ్యానర్లో చేస్తున్నారు అని వార్తలు పెరిగిపోయాయి. తాజాగా
సుజిత్ ఈ విషయాలపై క్లారిటీ ఇచ్చాడు.
సుజిత్ తాజాగా మాట్లాడుతూ ... ఓజి
సినిమా ఒక అద్భుతమైన మూవీ. ఆ
సినిమా విషయంలో నాకు అందరూ ఎంతో సపోర్ట్ చేశారు. ముఖ్యంగా దానయ్య గారు ఎంతో సపోర్ట్ ఇచ్చారు. ఆయన లేకుంటే
సినిమా మీ ముందుకు వచ్చేది కాదు అని
సుజిత్ తాజాగా చెప్పుకొచ్చాడు.