నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ కి భారీ షాక్..సభ్యత్వం రద్దు చేయాలని కాంగ్రెస్ నేత ఫిర్యాదు..!

Divya
ఇటీవల ప్రముఖ నటుడుగా పేరు పొందిన శ్రీకాంత్ అయ్యంగార్ మహాత్మా గాంధీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు అటు సిని,రాజకీయావర్గాలలో పెను దుమారాన్ని సృష్టించాయి. నిన్నటి రోజున ఈ నటుడు పైన కఠినమైన చర్యలు తీసుకోవాలంటు కొన్ని సంఘాలు పోలీస్ స్టేషన్ కు వెళ్లి మరి ఫిర్యాదు చేయగా, ఇప్పుడు తాజాగా కాంగ్రెస్ పార్టీ మూ అసోసియేషన్ కు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఈరోజు మా అధ్యక్షుడు మంచు విష్ణుకు కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకటేష్ ఫిర్యాదు చేసినట్లు సమాచారం.



యాక్టర్ శ్రీకాంత్  అయ్యంగార్ చేసిన వ్యాఖ్యలు చాలా అభ్యంతరంగా ఉన్నాయని, అతనికి మా సభ్యత్వాన్ని రద్దు చేయాలి అంటూ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేత మాట్లాడుతూ.. జాతిపిత గురించి ఇలా తప్పుడు స్టేట్మెంట్స్ ,అడ్డగోలుగా ఇష్టానుసారంగా మాట్లాడిన తీరు సరికాదని సినీ నటుడుగా ఏదైనా సమాజానికి మంచి సందేశం ఇవ్వాల్సింది పోయి జాతిపిత గురించి ఇలా  మాట్లాడడం సరికాదు.తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకొని నటుడు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ కూడా చేశారు. లేకపోతే నటుడని చూడకుండా రోడ్డుపై ఎక్కడికక్కడ అడ్డుకుంటామంటు హెచ్చరించారు.


జాతిపిత పై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే టాలీవుడ్ పెద్దలు ఎవరూ కూడా ఖండించలేదని కాంగ్రెస్ నేత ప్రశ్నించారు.. బాలయ్య, చిరంజీవి, మోహన్ బాబు లాంటి వ్యక్తులు నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ మాటలను ఖండించి ఆయన పైన చర్యలు తీసుకునేలా చూడాలి అంటు తెలియజేశారు కాంగ్రెస్ నేత. అంతేకాకుండా ఆయన నటించే సినిమాలలో తాము నటించమంటూ ప్రకటించాలని అప్పుడే సినీ ఇండస్ట్రీ పైన పెద్దల పైన గౌరవం ఉంటుందంటూ తెలియజేశారు.

ఈ విషయంపైన మా అసోసియేషన్  ప్రతినిధి శివ బాలాజీ మాట్లాడుతూ.. నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ చేసిన వ్యాఖ్యలను తమ దృష్టికి తీసుకువచ్చారు.. ఆయన మాట్లాడిన మాటలను తాము కూడా తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నామని, మా అసోసియేషన్ కి ఒక కమిటీ ఉంది ఆ కమిటీలో చర్చలు చర్చించి మరి నిర్ణయం తీసుకుంటామని, మా అసోసియేషన్ కేవలం వెలిఫెర్ మాత్రమే, వ్యక్తిగత విషయాలకు సంబంధించి న్యాయపరమైన చర్యలు తీసుకొనే అవకాశం లేదంటూ వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: