టీజర్:కామెడీతో అదరగొట్టేస్తున్న విశ్వక్ ఫంకీ.. పడి పడి నవ్వాల్సిందే..!
టీజర్ విషయానికి వస్తే.. కాయాధు లోహర్, విశ్వక్ మధ్య కామెడీ సన్నివేశాలు, రొమాంటిక్ సన్నివేశాలు, లవ్ సన్నివేశాలు హైలెట్గా ఉన్నాయి. ఇందులో విశ్వక్ డైరెక్టర్గా కనిపించబోతున్నారు. అలాగే వీకే.నరేష్ కామెడీ కూడా హైలెట్గా కనిపిస్తోంది టీజర్ లో. కాయదు లోహర్ తన అందంతో మరొకసారి కుర్రాలను మాయ చేసేలా కనిపిస్తోంది. బీమ్స్ సిసిరోలియో సంగీత ప్రత్యేకంగా ఆకట్టుకుంటోంది.మొత్తానికి టీజర్ తోనే ఫుల్ కామెడీగా ఆడియన్స్ ని ఆకట్టుకునే విధంగా కనిపిస్తోంది ఫంకీ టీజర్. జాతి రత్నాలు చిత్రాన్ని ఏ స్థాయిలో చూపించారో అదే స్థాయిలో అంతకుమించి వినోదాన్ని అందించేలా డైరెక్టర్ అనుదీప్ ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు కనిపిస్తోంది.
సినిమాకి తగ్గట్టుగా ప్రతి ఫ్రేమ్ ను కూడా చాలా అద్భుతంగా విజువల్స్ గా తెరకెక్కించారు డైరెక్టర్ అనుదీప్. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పైన ప్రముఖ నిర్మాత నాగ వంశీ నిర్మించారు. మొత్తం మీద ఫంకీ టీజర్ ప్రేక్షకులను మనస్పూర్తిగా నవ్వించేలా కనిపిస్తోంది. అయితే ఈ చిత్రానికి సంబంధించి రిలీజ్ డేట్ ని మాత్రం ప్రకటించలేదు చిత్రబృందం. ఈ చిత్రం తో హీరో విశ్వక్ సేన్ కూడా మరొకసారి సక్సెస్ అందుకునేలా కనిపిస్తున్నారు. కాయాదు లోహర్ ఈ సినిమాతో మరిన్ని అవకాశాలు అందుకునేలా కనిపిస్తోంది. మరి టీజర్ తోనే కడుపుబ్బ నవ్విస్తున్నారంటే ఇక ట్రైలర్ తో ఏ విధంగా ఆకట్టుకుంటారో చూడాలి మరి. ప్రస్తుతం టీజర్ వైరల్ అవుతోంది.