బండ్ల గణేష్ మాటలపై.. మళ్లీ స్పందించిన బన్ని వాసు.. ఏమన్నారంటే..?
అయితే ఇప్పుడు మరొకసారి ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ వివాదం పై మాట్లాడారు.. అసలు విషయంలోకి వెళ్తే లిటిల్ హార్ట్స్ ఈవెంట్ లో బండ్ల గణేష్ తనదైన స్టైల్ లో మాట్లాడారని ఇప్పుడు ని సినిమా హిట్ అయింది కాబట్టి అందరూ నీ చుట్టూనే తిరుగుతున్నారు! ఇది కేవలం 20 రోజులు మాయ, మహేష్ బాబు ట్విట్ వేశారు, విజయ్ దేవరకొండ షర్ట్ ఇచ్చారని ఆనందపడకు.. ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరు కూడా మెగాస్టార్ బావమరిదిలా, స్టార్ కమెడియన్ కొడుకుగా ,ఐకాన్ స్టార్ కి తండ్రి లాగా పుట్టలేరు.. కొంతమందికి మాత్రమే ఆ అదృష్టం కలుగుతుంది. మిగిలిన వాళ్ళు ఎంతలా కష్టపడిన చివరికి క్రెడిట్ మొత్తం వారికి వెళ్ళిపోతుందంటూ మాట్లాడారు.. అయితే ఈ వ్యాఖ్యలు చేసినప్పుడు అల్లు అరవింద్ కూడా అక్కడే ఉన్నారు.
ఈ విషయాలపై బన్నీ వాసు కూడా కొంతమేరకు అసహనాన్ని తెలియజేశారు. ఆ వెంటనే మైక్ తీసుకొని.. అల్లు అరవింద్ గారు స్టార్ కమెడియన్ కి పుట్టారు అనడం సరికాదని ఆయన పుట్టిన తరువాతే అల్లు రామలింగయ్య గారు స్టార్ కమెడియన్ గా పేరు సంపాదించారనే విషయం బండ్ల గణేష్ కి తెలియకపోవచ్చు అంటూ తెలిపారు. అయితే ఇప్పుడు తాజాగా ఇంటర్వ్యూలో ఈ విషయం పైన బన్నీ వాసు మాట్లాడుతూ.. బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలు నిజంగా షాక్కు గురి చేశారని, అల్లు అరవింద్ గారు ఇండస్ట్రీలో చేసిన సేవలు చాలానే ఉన్నాయి అలాంటి ఆయన గురించి మాట్లాడడం చాలా బాధగా అనిపించిందని, ఆరోజు ఈవెంట్ లో ఉన్న హ్యాపీ మూడ్ అంతా పోయింది అంటూ తెలిపారు. బండ్ల గణేష్ మాట్లాడిన వ్యాఖ్యలను మరి కొంతమంది వాస్తవమే చెప్పారంటు కామెంట్స్ చేస్తున్నారు.