మూడు రోజుల్లో కలెక్షన్ సునామి సృష్టించిన కాంతార చాప్టర్1..!
ఇక మూడవరోజు రూ.50 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టినట్లు సమాచారం. ఈ సినిమాకి రూ.125 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కించగా తిరిగి పొందినట్లు తెలిసింది. అక్టోబర్ 2వతేదీన కన్నడ, తెలుగు, హిందీ ,మలయాళం, తమిళ్ వంటి భాషలలో విడుదలైన ఈ సినిమా ఇప్పటివరకు రూ.162.85 కోట్ల రూపాయలు వచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా టికెట్ల బుకింగ్స్ పరిస్థితి చూస్తూ ఉంటే మరో రెండు రోజుల్లోనే రూ .200 కోట్లు దాటే అవకాశం ఉన్నట్లు ట్రెండ్ నిపుణులు తెలియజేస్తున్నారు.
కాంతార చాప్టర్1 సినిమా చూసిన తర్వాత చాలామంది సెలబ్రెటీలు రిషబ్ శెట్టి నీ ప్రశంసించారు. ఇందులో రిషబ్ నటన చూసిన వారందరూ కూడా ఆశ్చర్యపోతారు. కాంతార చిత్రానికి మించి మరి యాక్టింగ్ చేశారు. ఈ సినిమా కథ కూడా ప్రకృతి, దైవం, ప్రజల నమ్మకం వంటి కథాంశంతో తెరకెక్కించారు. అలాగే చివరిలో కాంతార చాప్టర్ 2 ఉంటుందనే విధంగా చూపించారు. మరి ఈ సినిమా ఎప్పుడు ఉంటుందనే విషయం మాత్రం చిత్ర బృందం ప్రకటించలేదు. మొత్తానికి అతి తక్కువ సమయంలోనే రూ.150 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టిన ఈ సినిమా రాబోయే రోజుల్లో ఎలాంటి రికార్డులను తిరగరాస్తుందో చూడాలి.