పవర్ స్టార్ పవన్
కళ్యాణ్ నటించిన ఓజి
సినిమా సెప్టెంబర్ 25 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయిన విషయం మన అందరికీ తెలిసిందే. మోస్ట్
బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటి మనులలో ఒకరు అయినటువంటి
ప్రియాంక అరుల్
మోహన్ ఈ సినిమాలో హీరోయిన్గా నటించగా ... యంగ్ టాలెంటెడ్
డైరెక్టర్ సుజిత్ ఈ
మూవీ కి దర్శకత్వం వహించాడు.
బాలీవుడ్ క్రేజీ నటులలో ఒకరు అయినటువంటి ఇమ్రాన్ హష్మీ ఈ
మూవీ లో విలన్ పాత్రలో నటించగా ...
ప్రకాష్ రాజ్ , శ్రేయ
రెడ్డి ,
అర్జున్ దాస్ ఈ
మూవీ లో ముఖ్య పాత్రలలో నటించారు.
ఎస్ ఎస్
తమన్ సంగీతం అందించిన ఈ
మూవీ ని డి
వి వి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రముఖ
నిర్మాత డి
వి వి దానయ్య నిర్మించాడు. ఈ
సినిమా విడుదలకు ముందు ఈ
మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించి విడుదల చేసిన ప్రచార చిత్రాలు అన్ని అద్భుతంగా ఉండడంతో ఈ
మూవీ పై ప్రేక్షకుల్లో విడుదలకు ముందు భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దానితో ఈ
మూవీ కి పెద్ద ఎత్తున ఫ్రీ రిలీజ్ బిజినెస్ కూడా ప్రపంచ వ్యాప్తంగా జరిగింది. ఈ
మూవీ కి ఓవర్ సిస్ ఏరియాలో 17.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.
ఈ
మూవీ కి విడుదల అయిన మొదటి రోజు అద్భుతమైన టాక్ రావడంతో ఈ
సినిమా ఇప్పటికే ఓవర్ సిస్ లో బ్రేక్ ఈవెన్ ఫార్మలా ను కంప్లీట్ చేసుకుని అద్భుతమైన లాభాలను అందుకుంది. ఇప్పటివరకు ఓజి సినిమాకు సంబంధించిన 7 రోజుల బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయింది. ఈ 7 రోజుల్లో ఈ సినిమాకు ఓవర్సీస్ లో 30.95 కోట్ల కలెక్షన్లు దక్కాయి. దానితో ఇప్పటికే ఈ
సినిమా ఓవర్సీస్ లో బ్రేక్ ఈవెన్ ఫార్ములాను కంప్లీట్ చేసుకుని భారీ లాభాలను కూడా అందుకుంది.