మెగాస్టార్
చిరంజీవి హీరో గా రూపొందిన సినిమాలను వరుస పెట్టి ఈ మధ్య కాలంలో రీ చేస్తున్న విషయం మనకు తెలిసిందే. కొన్ని సంవత్సరాల క్రితం
చిరంజీవి ఇంద్ర అనే సినిమాలో
హీరో గా నటించిన విషయం మన అందరికి తెలిసిందే.
ఆర్తి అగర్వాల్ ,
సోనాలి బింద్రే ఈ సినిమాలలో హీరోయిన్లుగా నటించగా ...
బి గోపాల్ ఈ
మూవీ కి దర్శకత్వం వహించాడు.
అశ్విని దత్ ఈ సినిమాను నిర్మించాడు. ఈ
మూవీ ఆ సమయంలో అప్పటివరకు ఏ తెలుగు
సినిమా వసూలు చేయని కలెక్షన్లను వసూలు చేసి టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఈ
మూవీ ని కొంత కాలం క్రితం పెద్ద ఎత్తున రీ రిలీజ్ చేశారు. రీ రిలీజ్ లో భాగంగా ఈ
సినిమా అద్భుతమైన కలెక్షన్లను వసూలు చేసింది.
చిరంజీవి చాలా సంవత్సరాల క్రితం రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందిన జగదేక వీరుడు
అతిలోక సుందరి అనే సినిమాలో
హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే.
శ్రీదేవి ఈ సినిమాలో
హీరోయిన్ గా నటించగా ...
అశ్విని దత్ ఈ
మూవీ ని నిర్మించాడు. ఈ
మూవీ ని కూడా కొంత కాలం క్రితం పెద్ద ఎత్తున రీ రిలీజ్ చేశారు. రీ రిలీజ్ లో భాగంగా ఈ
సినిమా కూడా భారీ కలెక్షన్లను
బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేసింది. ఇలా ఇప్పటివరకు
చిరంజీవి నటించిన
ఇంద్ర , జగదేక వీరుడు
అతిలోక సుందరి సినిమాలు రీ రిలీజ్ అయ్యి
బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కలెక్షన్లను వసూలు చేశాయి. ఇకపోతే చాలా సంవత్సరాల క్రితం
చిరంజీవి కొదమ సింహం అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే.
ఈ
మూవీ ని కూడా రీ రిలీజ్ చేయనున్నారు. తాజాగా అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా విడుదల చేశారు. ఈ సినిమాను ఈ సంవత్సరం
నవంబర్ 21 వ తేదీన రీ రిలీజ్ చేయనున్నట్లు ఈ
మూవీ మేకర్స్ తాజాగా అధికారికంగా ప్రకటించారు. మరి ఈ
సినిమా కూడా
ఇంద్ర , జగదేక వీరుడు
అతిలోక సుందరి సినిమాల మాదిరి రీ రిలీజ్ లో భాగంగా కూడా అద్భుతమైన కలెక్షన్లను వసూలు చేస్తుందేమో చూడాలి.