"కొత్త ప్రయాణం"..సమంత గుడ్ న్యూస్ ప్రకటన! రెండో పెళ్లి గురించేనా..?

Divya
టాలీవుడ్ హీరోయిన్ సమంత గురించి సినిమాలలో కంటే ఈమధ్య ఎక్కువగా రూమర్ బాయ్ ఫ్రెండ్ రాజ్ నిడిమోరుతో రెండవ పెళ్లి గురించి ఎక్కువగా వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా వీరిద్దరూ కలిసి తిరుగుతున్న ఫోటోలు కూడా వైరల్ గా మారడంతో ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూర్చింది. అయితే దసరా పండుగ సందర్భంగా సమంత ఫ్యాన్స్ కోసం ఒక అదిరిపోయి అప్డేట్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. 'కొత్త ప్రయాణం' అంటూ సోషల్ మీడియా స్టోరీస్ లో కొన్ని ఫోటోలను షేర్ చేసింది సమంత.


అయితే అభిమానులు ఆ కొత్త విషయం తెలుసుకోవడానికి చాలా ఎక్సైటింగ్ గా ఉన్నారు. ఇటీవల కాలంలో రెండవ పెళ్లి గురించి వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో అందుకు సంబంధించి సమంత కొత్త ప్రయాణం అంటూ హింట్ ఇచ్చిందంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి కొంతమంది సమంత కొత్త ఇంటికి షిఫ్ట్ అయ్యింది, ఆ కొత్తంటి ఫోటోలను షేర్ చేసింది అంటు కామెంట్స్ చేస్తున్నారు. అలాగే ఇందుకు సంబంధించి గోడ మీద కూడా సమంత నిక్ నేమ్ sam అని లోగోను కూడా ఏర్పాటు చేసుకుంది. మరి ఈ ఇల్లు సమంత హైదరాబాదులో కొనిందా? ముంబైలో కొనిందా అనే విషయం తెలియాల్సి ఉంది.


రాజ్ తో సమంత డేటింగ్ లో ఉన్నట్లు పలు రకాల వార్తలు వినిపిస్తున్న ఇప్పటికి ఈ విషయం మీద క్లారిటీ ఇవ్వలేదు. దీంతో వీరిద్దరి మధ్య రూమర్స్ రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి. ఇద్దరు కలిసి ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ , సీటాడేల్ వంటి వెబ్ సిరీస్ కోసం పనిచేశారు. అప్పుడు ఏర్పడిన పరిచయమే ప్రేమగా మారిందని వార్తలు వినిపిస్తుంటాయి. ఇందులో భాగంగానే ఇద్దరు కలిసి ఇప్పుడు కొత్త ఇంట్లోకి అడుగు పెట్టబోతున్న రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి అసలు విషయం ఏంటన్నది సమంత క్లారిటీ ఇస్తుందేమో చూడాలి. సమంత ప్రస్తుతం మా ఇంటి బంగారం, ది బ్లడీ కింగ్డమ్ వంటి చిత్రాల నటిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: