24 ఏళ్ల జూనియ‌ర్ ఎన్టీఆర్ స్టూడెంట్ నెంబ‌ర్ 1 క‌లెక్ష‌న్లు ఇవే... !

RAMAKRISHNA S.S.
టాలీవుడ్ యంగ్ టైగ‌ర్ జూనియ‌ర్ ఎన్టీఆర్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ‘స్టూడెంట్ నెంబర్ 1’ సినిమా వచ్చింది. ఎప్పుడో 2001లో రిలీజ్ అయిన ఈ సినిమా 24 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఇది ఎన్టీఆర్ కెరీర్లో 2వ సినిమాగా వచ్చింది. ఇది మొద‌ట సినిమాగా అనుకున్నారు. అయితే కొన్ని కార‌ణాల వ‌ల్ల ఆల‌స్యం కావ‌డంతో మ‌ధ్య‌లో ఉషాకిర‌న్ మూవీస్ బ్యాన‌ర్‌పై రామోజీరావు నిర్మించిన నిన్ను చూడాల‌ని ఎన్టీఆర్ మొద‌ట సినిమాగా స్టార్ట్ అయ్యింది. వీఆర్‌. ప్ర‌తాప్ ఈ సినిమాకు ద‌ర్శ‌కుడు.


ఇక రెండో సినిమా స్టూడెంట్ నెంబ‌ర్ 1 కు రాజ‌మౌళి ద‌ర్శ‌కుడు అయినా ద‌ర్శ‌కేంద్రుడు కె. రాఘ‌వేంద్ర‌రావు ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణ లో ఈ సినిమా తెర‌కెక్కింది.  2001 మే నెలలో నిన్ను చూడాల‌ని సినిమా వస్తే.. 2001 సెప్టెంబర్ 27న ‘స్టూడెంట్ నెంబర్ 1’ సినిమా వచ్చింది. ఈ సినిమా మొద‌టి షోతో నే సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ సెప్టెంబర్ 27 కి 24 ఏళ్ళు పూర్తిచేసుకుంటున్న ‘ స్టూడెంట్ నెంబర్ 1 ’ క్లోజింగ్ కలెక్షన్స్ చూద్దాం. ఇక అదే యేడాది డిసెంబ‌ర్‌లో ఎన్టీఆర్ మూడో సినిమా సుబ్బు రిలీజ్ అయ్యింది.


నైజాం -2.38 cr
సీడెడ్ -2.20 cr
ఉత్తరాంధ్ర -2.12 cr
ఈస్ట్ - 0.90 cr
వెస్ట్ - 0.86 cr
గుంటూరు - 0.95 cr
కృష్ణా - 0.85 cr
నెల్లూరు - 0.62 cr
---------------------------------------------
ఏపీ + తెలంగాణ (టోటల్) - 10.88 cr
---------------------------------------------

రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ =  0.70 Cr
వరల్డ్ వైడ్ (టోటల్)11.58 cr


ఈ వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: