రెబల్ స్టార్
ప్రభాస్ ప్రస్తుతం
మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న
రాజా సాబ్ అనే సినిమాలో
హీరో గా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో
నిధి అగర్వాల్ ,
మాళవిక మోహన్ , రీద్ధి
కుమార్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు.
మారుతి ఈ సినిమాను హార్రర్
కామెడీ ఎంటర్టైనర్
మూవీ గా రూపొందిస్తున్నాడు. ఈ సినిమాను వచ్చే సంవత్సరం
సంక్రాంతి పండుగ సందర్భంగా
జనవరి 9 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ
మూవీ బృందం వారు తాజాగా అధికారికంగా ప్రకటించాడు.
ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ను ఈ
మూవీ యూనిట్ తాజాగా విడుదల చేసింది. ఈ
మూవీ ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభిస్తుంది. ఈ
మూవీ ట్రైలర్ కి విడుదల అయిన 24 గంటల్లో ఎన్ని వ్యూస్ , లైక్స్ వచ్చాయి అనే వివరాలను క్లియర్ గా తెలుసుకుందాం. ఈ
మూవీ ట్రైలర్ కు విడుదల ఆయన 24 గంటల్లో 14.48 మిలియన్ వ్యూస్ ... 513 కే లైక్స్ లభించాయి. ఓవరాల్ గా చూసుకుంటే ఈ
మూవీ ట్రైలర్ కి విడుదల అయిన 24 గంటల్లో మంచి రెస్పాన్స్ లభించింది. కానీ
ప్రభాస్ అభిమానులు ఈ
మూవీ ట్రైలర్ అనేక ట్రైలర్ రికార్డులను బద్దలు కొడుతుంది అని అద్భుతమైన వ్యూస్ , లైక్స్ ను సాధిస్తుంది అని భావించారు.
ఆ స్థాయి రికార్డులను నిలకలపడంలో మాత్రం ఏ ట్రైలర్
సక్సెస్ కాలేకపోయింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతానికి రాజ సాబ్
మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. మరి ఈ
సినిమా ఇలాంటి విజయాన్ని అందుకుంటుందో తెలియాలి అంటే ఇంకా చాలా కాలం వెయిట్ చేయాల్సిందే. ఈ
మూవీ కి ఎస్ ఎస్
తమన్ సంగీతం అందిస్తూ ఉండగా ... పీపుల్స్
మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై ప్రముఖ
నిర్మాత టి జి
విశ్వ ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.