మోస్ట్
బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటిమణి సంయుక్త
మీనన్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ
బ్యూటీ పవన్
కళ్యాణ్ , దగ్గుపాటి
రానా హీరోలుగా రూపొందిన భీమ్లా
నాయక్ అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ
మూవీ లో ఈమె
రానా కి
భార్య పాత్రలో నటించింది. ఈ
సినిమా మంచి విజయం సాధించడంతో ఈమెకు మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత ఈమె నటించిన బింబిసారా , సార్ , విరూపాక్ష సినిమాలు వరుసగా విజయాలను అందుకున్నాయి. దానితో ఈమె క్రేజ్ ఒక్క సారిగా తెలుగు సినీ పరిశ్రమలో పెరిగిపోయింది.
ఆఖరుగా ఈమె
కళ్యాణ్ రామ్ హీరోగా రూపొందిన డెవిల్ సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ
మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఈ
సినిమా విడుదల అయ్యి ఇప్పటికే చాలా కాలం అవుతుంది. కానీ ఇప్పటివరకు డెవిల్
సినిమా తర్వాత ఈమె నటించిన ఏ
సినిమా కూడా విడుదల కాలేదు. వరుసగా విజయాలను అందుకున్న ఈమెకు ఒక్క అపజయం రావడం తోనే చాలా కాలం గ్యాప్ తీసుకొంది. కానీ ప్రస్తుతం ఈ
బ్యూటీ చేతిలో ఏకంగా 8 సినిమాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ
బ్యూటీ నిఖిల్ హీరోగా రూపొందుతున్న స్వయంభు అనే సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది.
అలాగే
పూరి జగన్నాథ్ ,
విజయ్ సేతుపతి కాంబోలో రూపొందుతున్న సినిమాలో కూడా ఈమె హీరోయిన్గా నటిస్తోంది. శర్వానంద్ హీరోగా రూపొందుతున్న నారీ నారీ నడుమ
మురారి సినిమాలో కూడా ఈ
బ్యూటీ హీరోయిన్గా నటిస్తోంది.
బెల్లంకొండ శ్రీనివాస్ తో హైందవ అనే సినిమాలో నటిస్తోంది.
రాఘవ లారెన్స్ హీరోగా నటిస్తున్న బెంజ్ మూవీలోను ,
హిందీ లో మహారాణి సినిమాలోను ఈమె నటిస్తోంది. అలాగే
బాలకృష్ణ హీరో గా రూపొందుతున్న అఖండ 2 మూవీలో కూడా ఈమె నటిస్తోంది. ఇలా ప్రస్తుతం ఈమె చేతిలో ఏకంగా 8 సినిమాలు ఉన్నాయి.