కల్కి తర్వాత ప్రభాస్ – హను రాఘవపూడి కాంబోలో కొత్త సర్ప్రైజ్!

Amruth kumar
ప్రభాస్ కెరీర్ లో కల్కి 2898 AD ఒక గేమ్‌చేంజర్ మూవీగా నిలిచింది. ఆ సినిమాలో అమితాబ్ బచ్చన్ పోషించిన అశ్వద్ధామ పాత్ర ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసింది. అమితాబ్ ఒక తెలుగు సినిమాలో ఇంత ప్రభావం చూపించడం ఇదే మొదటిసారి. అందుకే ఆ సినిమా ప్రమోషన్స్ టైమ్‌లో ఆయన పదేపదే ప్రస్తావిస్తూ, సోషల్ మీడియాలో ట్వీట్లు చేస్తూ, ఇంటర్వ్యూల్లో ప్రత్యేకంగా గుర్తు చేశారు. ఈ లవ్, డెడికేషన్ వలన కల్కి టీమ్‌కి - ప్రభాస్, నాగ అశ్విన్, నిర్మాత అశ్విని దత్‌తో బిగ్ బి‌కి ఒక ప్రత్యేక బాండింగ్ ఏర్పడింది. అదే బాండ్ ఇప్పుడు మరోసారి వర్క్ అవుట్ అవుతుందేమోనని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.



తాజాగా వస్తున్న సమాచారం ప్రకారం ప్రభాస్ నటిస్తున్న ఫౌజీ (ప్రచారంలో ఉన్న టైటిల్) సినిమాలో ఒక కీలక పాత్ర కోసం అమితాబ్ కుమారుడు అభిషేక్ బచ్చన్ ని దర్శకుడు హను రాఘవపూడి సంప్రదించినట్టు తెలుస్తోంది. ఇంకా ఆఫీషియల్ కన్ఫర్మేషన్ రాకపోయినా, జూనియర్ బిగ్ బి నుంచి సానుకూల సంకేతం వచ్చిందని ముంబై వర్గాలు చెబుతున్నాయి. ఈ పాత్ర సీతారామంలో సుమంత్ క్యారెక్టర్‌లా స్టోరీలో మలుపు తిప్పే స్థాయిలో ఉంటుందట. ప్రభాస్ ప్రేమకథకు డెప్త్ ఇచ్చే, ఎమోషనల్‌గా గుర్తుండిపోయే రోల్ కావడంతో, అభిషేక్ అయితేనే న్యాయం చేయగలరని యూనిట్ భావించిందట. ఇకపోతే ది రాజా సాబ్ జనవరి 2026లో థియేటర్లకు రానుంది. ఆ తర్వాత ప్రభాస్ నుంచి రాబోయే బిగ్ రిలీజ్ ఫౌజీ అవుతుంది.

 

ఇప్పటికే సగానికి పైగా షూట్ పూర్తిచేసిన ఈ సినిమా, పీరియాడిక్ డ్రామాగా రూపొందుతోంది. బ్రిటిష్ కాలం నాటి స్వాతంత్ర సమరం నేపథ్యంలో సాగే ఈ కథలో ఒక ఇంటెన్స్ లవ్ స్టోరీని హను రాఘవపూడి తెరపై ఆవిష్కరించబోతున్నారు. ప్రభాస్‌ని అభిమానులు ఇంతవరకు చూడని కొత్త షేడ్‌లో చూపించబోతున్నారని ఇన్‌సైడ్ టాక్.విశాల్ చంద్రశేఖర్ సంగీతం సమకూరుస్తున్న ఈ భారీ చిత్రాన్ని movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. 2026 దసరా లేదా దీపావళి సీజన్‌ను లక్ష్యంగా పెట్టుకుని షూట్ పూర్తి చేసి రిలీజ్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఇప్పుడు అభిషేక్ బచ్చన్ ఎంట్రీతో ఈ ప్రాజెక్ట్‌కి మరింత బలమొస్తుందని, బాలీవుడ్ & టాలీవుడ్ కలయికలో మరో హైలైట్ మూవీగా నిలుస్తుందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: