దమ్ముంటే మనోజ్ ని కొట్టండిరా అంటూ రైటర్ ఓపెన్ ఛాలెంజ్ చేశారు.. అదేంటి ఆ రైటర్ కి మనోజ్ మీద ఏమైనా పగనా.. ఎందుకు అలా చెబుతారు అని మీకు డౌట్ రావచ్చు.అయితే మనోజ్ పై ఆ రచయితకు ఎలాంటి కోపం లేదు.కానీ మనోజ్ విల నిజాన్ని చూసి ఆ రచయిత ఇంప్రెస్ అయ్యారు. ఇక విషయంలోకి వెళ్తే.. తాజాగా మిరాయ్ మూవీ హిట్ అయిన నేపథ్యంలో సినిమాకి సంబంధించి సక్సెస్ మీట్ నిర్వహించారు మేకర్స్.అయితే ఈ సక్సెస్ మీట్ కి రైటర్ అయినటువంటి బివిఎస్ రవి హాజరయ్యారు. ఇక ఇందులో మనోజ్ యాక్టింగ్ గురించి చెబుతూ.. మనోజ్ ఈ సినిమాలో అద్భుతంగా యాక్టింగ్ చేశారు. ఈయన యాక్టింగ్ చూసి నేను ఇంప్రెస్ అయ్యాను.
విలన్ ని కొట్టాలంటే హీరో అవ్వాలి. కానీ మహాబీరని కొట్టాలంటే సూపర్ హీరో అయి ఉండాలి.. మంచు మనోజ్ యాక్టింగ్ చూశాక కొడితే మంచు మనోజ్ ని కొట్టి హీరో అవ్వాలి రా అనిపించింది.అసలు మనోజ్ ని కొట్టకపోతే హీరోనే కాదు అని ఫీలింగ్ వచ్చేంత గొప్పగా మనోజ్ ఈ సినిమాలో నటించారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు బెస్ట్ విలన్ దొరికేశాడు. మనోజ్ తనకు దగ్గరైన ప్రతి ఒక్కరిని అన్నా అని ప్రేమగా పిలుస్తాడు. అందుకే మనోజ్ నాకు తమ్ముడు లాంటివాడు..
మనోజ్ మిరాయ్ మూవీ తో సరికొత్త అధ్యాయాన్ని ఓపెన్ చేశాడు. కచ్చితంగా సక్సెస్ అవుతాడు అయ్యాడు కూడా.. ఇక కార్తీక్ ఘట్టమనేని చూడ్డానికి చిన్నపిల్లడిలానే ఉన్నప్పటికీ సినిమా మాత్రం అద్భుతంగా తెరకెక్కించారు. అలాగే తేజకి ఎలాంటి బ్యాడ్ హాబిట్స్ లేవు. కేవలం ఆయన సినిమాలతో ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేయాలి అని ఒకే ఒక్క ఆలోచన మైండ్ లో పెట్టుకున్నారు అంటూ మిరాయ్ సక్సెస్ మీట్ లో ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశారు రచయిత బివిఎస్ రవి..