ఆ అవమానం ఎప్పటికీ మర్చిపోలేను.. సూర్య హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు..!
అపర్ణ బాలమురళి మాట్లాడుతూ.. సన్నగా ఉన్నప్పుడు ఇంత సన్నగా ఉన్నావేంటి? కాస్త లావుగా ఉన్నప్పుడు ఇంత లావు అయ్యావ్ ఏంటి? అనే విమర్శలు ఎన్నో ఎదుర్కొన్నాను ఈ విమర్శలపై మొదట చాలా బాధపడ్డానని.. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలో ఒకసారి విమాన ప్రయాణం చేసి దిగి ఎయిర్ పోర్ట్ లో నడుచుకుంటూ వెళుతున్న సమయంలో ఒక వ్యక్తి తన దగ్గరికి వచ్చి.. మీ రూపం ఇలా మారిపోయిందా? అంటూ తనని ప్రశ్నించారని. ఈ విషయంపై తాను ఆశ్చర్యపోయాను.. అతను తన శరీరం గురించి మాత్రమే మాట్లాడారా లేకపోతే ఇంకేమైనా అని చాలా బాధ అనిపించిందని.. ఆ వ్యక్తి చేసిన వ్యాఖ్యలు తాను జీవితంలో మర్చిపోలేనట్టు తెలిపింది.
సినీ కెరియర్ ప్రారంభంలో ఇలాంటివి ఎన్నో బాధలు ఎదుర్కొన్నానని ఆ తరువాత వాటిని పట్టించుకోకుండా వదిలేసి దృఢంగా మారానని తెలిపింది. అపర్ణ బాలమురళి ఎక్కువగా మలయాళ చిత్రాలలో నటిస్తోంది. సూర్య నటించిన ఆకాశం నీ హద్దురా సినిమాలో అద్భుతమైన నటనతో మెప్పించింది. అలా ఎన్నో అనువాద చిత్రాలతో తెలుగులో కూడా పేరు సంపాదించింది. 2018, రాయన్, కిష్కిందకాండ, రుధిరం వంటి చిత్రాలలో నటించింది. తెలుగులో స్ట్రైట్ గా సినిమా మాత్రం చేయలేదు. అపర్ణ బాలమురళి చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ప్రస్తుతం అపర్ణ నటిస్తున్న సినిమాల విషయానికి వస్తే మీర్జ్ సినిమాలో నటిస్తోంది ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్నది.