కొత్త టాటూతో ప్రభాస్ హీరోయిన్..టాటూ వెనుక అంతా కథ ఉందా..?
ఈ టాటూని తన కాలు మీద వేయించుకుంది.. ఎగిరే పక్షి టాటూ. దాని కింద ఒక ప్రేరణాత్మకమైన కొటేషన్ కూడా రాసుకుంది. ఈ టాటూ వెనుక ఉన్న భావాన్ని వివరిస్తూ.. "నేను టాటూ వేయించుకుంటానని ఎప్పుడూ అనుకోలేదు కానీ మొదటిసారి వేసుకున్నాను.. నా వాగ్దానం నెరవేరింది.. ఈ టాటూలో ఉండే పక్షి లాగే తాను కూడా స్వేచ్ఛగా ఉదయం సూర్యోదయాన్ని ఆస్వాదిస్తూ నా జీవితాన్ని గడపాలని ఆశిస్తున్నాను.. కళ్ళల్లో కళలు ఉన్నవారు మీరు భయపడే ఆ ఎత్తుని అంగీకరించాలి.. అది అంత సులువు కాదు.. కానీ మీ మార్గాన్ని మీరు కనుక్కోవడంలో ఎగరడం నేర్చుకుంటారు అందుకు ముందు అడుగు వేయాలి అంటూ తన టాటూ వెనుక ఉన్న భావనను తెలియజేసింది".
కృతి సనన్ చేసిన ఈ బాగోద్వేగమైన టాటూ పోస్టు సోషల్ మీడియాలో అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస సినిమాలలో నటిస్తున్న ఈ ముద్దుగుమ్మ హిట్ , ఫ్లాప్ తో సంబంధం లేకుండా నటిస్తోంది. గత కొంతకాలంగా కృతి సనన్ పెళ్లి విషయం పైన కూడా రూమర్స్ వినిపిస్తున్నాయి. ఆమధ్య ప్రభాస్ తో డేటింగ్ అంటూ రూమర్స్ వినిపించగా ఆ విషయాన్ని ఖండించింది. కానీ త్వరలోనే స్టార్ హీరోతో ఈమె పెళ్లి కాబోతోంది అంటూ బాలీవుడ్ మీడియాలో వినిపిస్తున్నాయి.