3 రోజుల్లో కిష్కిందపురికి వచ్చిన కలెక్షన్స్ ఇవే.. ఇంకా అన్ని కోట్లు వస్తేనే హిట్ స్టేటస్..?

Pulgam Srinivas
టాలీవుడ్ యువ నటుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తాజాగా కిష్కిందపురి అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా నటించింది. ఈ సినిమా మంచి అంచనాల నడుమ సెప్టెంబర్ 12 వ తేదీన విడుదల అయింది. మొదటి నుండి ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. దానితో ఈ మూవీ పెద్ద ఎత్తున విడుదల అయింది. ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన మూడు రోజుల బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయింది. ఈ మూడు రోజుల్లో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా ఏ ఏరియాలో ఏ రేంజ్ కలెక్షన్లు వచ్చాయి. ఇంకా ఎన్ని కోట్ల కలెక్షన్స్ వస్తే ఈ సినిమా హిట్ స్టేటస్ను అందుకుంటుంది అనే వివరాలను తెలుసుకుందాం.

మూడు రోజుల బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ఈ మూవీ కి నైజాం ఏరియాలో 2.40 కోట్ల కలెక్షన్లు దక్కగా , సీడెడ్ ఏరియాలో 32 లక్షలు , ఆంధ్ర ఏరియాలో 2.50 కోట్ల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి మూడు రోజుల్లో ఈ సినిమాకు 5.22 కోట్ల షేర్ ... 9.55 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. మూడు రోజుల్లో ఈ సినిమాకు కర్ణాటక , రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్సీస్ లలో కలుపుకొని 1.10 కోట్ల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా మూడు రోజుల్లో ఈ సినిమాకు 6.32 కోట్ల షేర్ ... 12.50 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఈ మూవీ హిట్ స్టేటస్ను అందుకోవాలి అంటే ప్రపంచ వ్యాప్తంగా 10.5 కోట్ల రేంజ్ లో షేర్ కలెక్షన్లను రాబట్ట వలసి ఉంది. దానితో ఈ మూవీ మరో నాలుగు కోట్ల షేర్ కలెక్షన్లను  రాబడితే హిట్టు స్టేటస్ ను అందుకుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

bss

సంబంధిత వార్తలు: