వరస హిట్స్ పెరిగిన తేజ సజ్జ క్రేజ్.. జాంబి రెడ్డి 2 బడ్జెట్ ఎన్ని కోట్ల తెలుసా..?

Pulgam Srinivas
సినిమా ఇండస్ట్రీ లో ఏ హీరో కైనా వరుస పెట్టి విజయాలు దక్కుతున్నాయి అంటే ఆయన క్రేజ్ కూడా ఫుల్ గా పెరుగుతూ ఉంటుంది. దానితో ఆయన మునపటి సినిమాలతో పోలిస్తే హిట్స్ తర్వాత చేసే సినిమాలు బడ్జెట్ కూడా భారీగా పెరుగుతూ ఉంటుంది. ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో ఓ యువ హీరో కెరియర్ కూడా ఇలానే ముందుకు సాగుతుంది. ఆ యువ హీరో ఎవరు అనుకుంటున్నారా ..? ఆయన మరెవరో కాదు ... తేజ సజ్జ. తేజ సజ్జ కెరియర్ ప్రారంభంలో ఎన్నో సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం ఈయన సినిమాల్లో హీరోగా నటిస్తూ వస్తున్నాడు.


కొంత కాలం క్రితం ఈయన జాంబీ రెడ్డి అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. ఆ సమయంలో తేజ కి పెద్దగా క్రేజ్ లేదు. దానితో ఈ మూవీ ని తక్కువ బడ్జెట్లో రూపొందించారు. కానీ ఈ సినిమా మాత్రం అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. తేజ కొంత కాలం క్రితం హనుమాన్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ భారీ బ్లాక్ బాస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మూవీ తర్వాత ఈయన మిరాయ్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తాజాగా విడుదల అయిన ఈ సినిమా కూడా అద్భుతమైన టాక్ ను తెచ్చుకొని భారీ కలెక్షన్లను వసూలు చేస్తుంది.


ఇకపోతే కొంత కాలం క్రితమే జాంబీ రెడ్డి 2 మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలుబడింది. ఇక వరుస పెట్టి తేజ నటించిన సినిమాలు బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకుంటూ వెళ్లడంతో జాంబీ రెడ్డి 2 బడ్జెట్ భారీగా పెరిగినట్లు తెలుస్తోంది. ఏకంగా జాంబి రెడ్డి 2 సినిమాను 100 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందించాలి అని మేకర్స్ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఇలా వరుస విజయాలతో తేజ క్రేజ్ కూడా భారీగా పెరిగినట్లు దీనితో స్పష్టంగా అర్థం అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: