మల్లెపూలకు లక్ష జరిమాన !

Seetha Sailaja
ఇండియా నుండి విదేశాలకు వెళ్ళి సెలెబ్రెటీల నుండి సామాన్యుల వరకు వారు వెళ్ళే దేశాలలోని నిబంధనలు తెలుసుకోకుండా ఆదేశానికి వెళితే అనుకోని సమస్యలు ఎదురవుతాయి. ఇలాంటి సందర్భం ఈమధ్య మాలీవుడ్ హీరోయిన్ నవ్య నాయర్ కు ఎదురైనట్లు వార్తలు వస్తున్నాయి. దక్షిణ భారతదేశంలో స్త్రీలు అమ్మాయిలు మల్లెపూలు అంటే బాగా ఇష్టపడతారు అన్న విషయం అందరికీ తెలిసిందే. 



ముఖ్యంగా మళయాళీలు ‘ఓనమ్’ పండుగ జరిగే రోజులలో చాల సాంప్రదాయంగా వస్త్రధారణ చేసుకోవడమే కాకుండా ఆ కాలంలో లభించే పూలు అలంకరించుకోవడం అక్కడి అమ్మాయిలకు ఒకసరదా. ఇప్పుడు అటువంటి సరదా మళయాళి హీరోయిన్ నవ్య నాయర్ కు తెచ్చి పెట్టిన ఊహించని సమస్య మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.  



ఆస్ట్రేలియా మెల్‌బోర్న్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆమె దగ్గర ఉన్న హ్యాండ్ బ్యాగ్ లో ఉన్న 15 సెంటీమీటర్ల పొడవు గల మల్లె దండకు అక్కడి అధికారులు 1.14 లక్షల జరిమానా విధించడంతో ఆహీరోయిన్ షాక్ కు గురైనట్లు తెలుస్తోంది. ఆస్ట్రేలియాలోని మలయాళీ సంఘం వారు నిర్వహించిన ఓనమ్ వేడుకల్లో పాల్గొనడానికి వెళ్ళిన నవ్య నాయక్ తన సొంత ఊరు కొచ్చిన్ నుండి ఆస్ట్రేలియాకు బయలుదేరే సమయంలో ఆమె తండ్రి ఆమెకు ఒక మల్లెపూల దండ కొని ఇచ్చి ‘ఒక భాగం వాడుకో మిగతావి హ్యాండ్‌బ్యాగ్‌ లో పెట్టుకో” అని సలహా ఇచ్చాడట. 


ఇప్పుడు ఆవిషయమే ఆమెకు అనుకోని సమస్యలు తెచ్చిపెట్టింది. విదేశాల నుండి ఆస్ట్రేలియా కు ఎవరైనా వస్తున్నప్పుడు ఆదేశ బయోడైవర్సిటీ రూల్స్ ప్రకారం పూలు పండ్లు విత్తనాలు మొక్కల వేర్లు వంటివి ఎవరు తీసుకురాకూడదట. అలా చేస్తే అది ఆదేశ  పర్యావరణానికి హాని కలిగించే అవకాశముందని అక్కడి ప్రభుత్వాలు భావిస్తూ ఉండటంతో తెలియక చేసిన పొరపాటుకు అయినా భారీ జరిమానాలు వేస్తారట. ఇప్పుడు తెలియక చేసిన పొరపాటు అయినప్పటికీ నవ్య నాయర్ కు భారీ జరిమానా కట్టుకోవాలసి రావడం ఆశ్చర్యాన్ని కలిగించే సంఘటన.. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: