ప్రేక్షకుడి దెబ్బ.. థియేటర్ యాజమాన్యం సంచలన నిర్ణయం!

Divya
ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ఎక్కువగా పాన్ ఇండియా సినిమాల హవానే కొనసాగుతోంది. కానీ అప్పుడప్పుడు పెద్ద చిత్రాలే కాదు చిన్న సినిమాలు కూడా విడుదలవుతూ మంచి విజయాలను అందుకుంటున్నాయి. అయితే కొన్ని సందర్భాలలో బడా సినిమాలు సైతం అభిమానుల అంచనాలను అందుకోలేక ఫ్లాప్ అవ్వడంతో.. థియేటర్ యాజమాన్యం కనీసం రెంట్ కట్టలేని విధంగా పరిస్థితికి చేరుకుంటోంది. దీనివల్ల సినిమాను కొన్న బయ్యర్లు, థియేటర్స్ యాజమాన్యం కూడా భారీ నష్టాలను చవిచూస్తున్నారు. ఈ క్రమంలోనే కొంతమంది థియేటర్స్ యాజమాన్యం ఒక సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.


నిజానికీ నిర్మాతలు కొంతమంది సినిమాలకు థియేటర్లు ఇవ్వలేదంటూ చెప్పిన సందర్భాలు ఉన్నాయి. కానీ థియేటర్స్ యాజమాన్యం మాత్రం.. మా థియేటర్లకు సినిమాలు రావట్లేదు.. డబ్బులు కూడా రావట్లేదు అంటూ  చెబుతున్నారు. అందుకే ఐమాక్స్ థియేటర్ వారు .. సంచలన నిర్ణయం తీసుకున్నారు. pvr ,imax సినిమా అఫీషియల్ అకౌంట్లో  వాళ్ల వాళ్ల థియేటర్లను వర్క్ షాప్స్ కి, ట్రైనింగ్ సెంటర్లకు, ప్రైవేట్ ఈవెంట్లకు ఇస్తామంటూ ఓపెన్ గానే అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారు. బుక్ నౌ అంటూ కంఫర్టబుల్ సిట్టింగ్ విత్, అన్ రిస్ట్రిక్టెడ్  వ్యూ అంటు కొన్నిటిని పోస్ట్ చేస్తూ ప్రమోషన్స్ చేసుకుంటున్నారు.


దీన్ని బట్టి చూస్తూ ఉంటే థియేటర్లు సినిమాలకు ఇవ్వకపోవడం సమస్య కాదు.. సమస్య అంతా ఆ డబ్బులు కట్టగలిగే పరిస్థితులు ఉంటే ఏ చిత్రానికైనా ఇస్తామని థియేటర్  యాజమాన్యం తెలియజేస్తున్నట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం ఉన్న కాలంలో సామాన్యులు సైతం టికెట్ కొని వెళ్లాలంటే.. జేబుకు చిల్లుపడేలా కనిపిస్తున్నాయి. ఇక ఫ్యామిలీతో వెళ్లాలి అంటే సుమారుగా మూడు నుంచి నాలుగు వేల రూపాయల వరకు ఖర్చవుతుంది. వీటన్నింటినీ భరించలేక ఈమధ్య చాలామంది థియేటర్లకు వెళ్లడం మానేస్తున్నారు. కేవలం ఓటీటి బాటలోనే సినిమాలను చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక ఇదే కొనసాగితే భవిష్యత్తులో థియేటర్స్ ఉంటాయా అని అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: