ఏం పీక్కుంటావో పీక్కో అంటూ ఎస్పీ బాలసుబ్రమణ్యం తనయుడు ఎస్పీ చరణ్ ని ఆ సహాయ దర్శకుడు తీవ్ర బెదిరింపులకు గురి చేస్తున్నాడట.. ఆ సహాయ దర్శకుడు బెదిరింపులకు భయపడి పోయిన ఎస్పీ చరణ్ ఏకంగా పోలీస్ స్టేషన్లో కేసు కూడా పెట్టారు.మరి ఇంతకీ ఎస్పీ చరణ్ ని బెదిరిస్తున్న ఆ సహాయ దర్శకుడు ఎవరు.. ఎవరి అండదండలు చూసుకొని ఆయన అలా బెదిరిస్తున్నారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం.. సినిమా ఇండస్ట్రీలో ఉండే చాలామంది సెలబ్రిటీలు వచ్చిన డబ్బులతో ఇల్లు, పొలాలు, స్థలాలు ఇలా ఎన్నో కొనుక్కుంటూ ఉంటారు. అలా ఇండియన్ సినీ హిస్టరీలో గాన గంధర్విడిగా ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఎస్పీ బాలసుబ్రమణ్యం తన మధురమైన గానంతో ఎంతోమంది శ్రోతలను ఆకట్టుకున్నారు.
అలా దాదాపు 40 వేలకు పైగా పాటలు పాడిన ఈయన సౌత్ ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించారు.అయితే అలాంటి బాలసుబ్రమణ్యం తనయుడు ఎస్పీ చరణ్ మాత్రం తండ్రి అంతటి గుర్తింపు అయితే తెచ్చుకోలేదు. ఇదిలా ఉంటే తాజాగా ఎస్పీ చరణ్ ఓ సహాయ దర్శకుడి పై పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. దానికి కారణం ఏంటంటే.. ఎస్పీ చరణ్ కి సాలి గ్రామంలో ఉండే సత్య గార్డెన్ లో ఉన్న అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ ఉందట. అయితే ఈ ఫ్లాట్ గత కొద్ది నెలల క్రితం తమిళనాడు పరిశ్రమలో సహాయ దర్శకుడిగా పనిచేస్తున్న తిరుజ్ఞానానికి అద్దెకిచ్చారట.. అయితే తిరు జ్ఞానానికి రెంటుకు ఇచ్చే ముందే 1,50,000 అడ్వాన్స్ ఎస్పీ చరణ్ తీసుకున్నారట. అలాగే నెలకు 40,500చెల్లించాలని మాట్లాడుతున్నారట..
ఇక అంతా బాగానే ఉన్నప్పటికీ సడన్గా ఎస్పీ చరణ్ ని బెదిరింపులకు గురి చేస్తున్నారట సహాయ డైరెక్టర్ తిరుజ్ఞానం.. ఎందుకంటే గత 25 నెలలుగా రెంట్ చెల్లించడం లేదట.రెంట్ ఇవ్వమని ఎస్పీ చరణ్ ఫోన్ చేసి అడగగా ఇస్తానని చెప్పారట. కానీ ఎంతకు అద్దే చెల్లించకపోవడంతో ఇంటికి వెళ్లి అడగగా ఏం చేసుకుంటావో చేసుకోపో అంటూ అసభ్యకరమైన మాటలతో పాటు బెదిరింపులకు గురి చేసారట. ఇలా అయితే కుదరదని ఎస్పీ చరణ్ నేరుగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి సహాయ డైరెక్టర్ తిరుజ్ఞానం మీద కేసు పెట్టారట. అలాగే జరిగిన విషయం మొత్తం చెప్పి తనకు 25 నెలలుగా రావాల్సిన రెంట్ ని తిరిగి ఇప్పించి వెంటనే ఆ ఫ్లాట్ నుండి ఆయన్ని ఖాళీ చేయించమని పోలీసులను కోరారట.ఇక ఎస్పీ చరణ్ పెట్టిన కేసును నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు