రజనీకాంత్ - కమల్ మల్టీస్టారర్... ఫ్యీజులు ఎగిరే ట్విస్టులు...?
సూపర్ స్టార్ రజినీకాంత్, యూనివర్సల్ హీరో కమల్ హాసన్ ఒకే తెరపై కనిపించబోతున్నారని వచ్చిన వార్త నిజంగానే ఇండియన్ సినిమాను షేక్ చేసింది. ఈ ఇద్దరు స్టార్ హీరోలు విడివిడిగా చేసిన సినిమాలు ఎంత పెద్ద విజయాలను సాధించాయో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కమల్ హాసన్ నటించిన విక్రమ్ ఇండియన్ సినిమా స్థాయిలోనే రికార్డులు సృష్టించింది. అదే లోకేష్ రజినీకాంత్‌తో చేసిన కూలీ కూడా ఓకే అనిపించుకుంది. ఈ ఇద్దరు స్టార్ హీరోలను కలిపి ఒకే ఫ్రేమ్‌లో చూడాలని అభిమానులు చాలా ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. ఇలాంటి సమయంలో కమల్ హాసన్ స్వయంగా ఓ ఈవెంట్‌లో ఈ మల్టీస్టారర్ ప్రాజెక్ట్‌పై స్పందించడం విశేషంగా మారింది. “మా కాంబినేషన్ చాలా ఏళ్ల క్రితమే జరగాల్సింది. కానీ ఇప్పుడు అది రియాలిటీ అవుతోంది. ఇది కేవలం ఒక సినిమా మాత్రమే కాదు, బిజినెస్ పరంగా కూడా సర్‌ప్రైజ్ చేసే కాంబినేషన్ అవుతుంది” అని ఆయన చెప్పడం అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది.
ఇండియన్ సినిమాకు లెజెండ్స్ అయిన రజినీకాంత్, కమల్ హాసన్‌ల కలయిక ఎప్పుడూ ఒక కలల ప్రాజెక్ట్‌గానే పరిగణించబడింది. ఈ ఇద్దరి మధ్య ఉన్న స్నేహం, పరస్పర గౌరవం వేరే స్థాయిలో ఉంటుంది. అయితే తెరపై ఈ జంటను కలిసి చూడటం అనేది ఒక మాసివ్ సెలబ్రేషన్ అవుతుంది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తాడా లేదా అన్నదానిపై ఇంకా క్లారిటీ లేదు. కానీ లోకేష్ శైలి, విజన్‌ను బట్టి చూస్తే ఈ ప్రాజెక్ట్‌కి సరైన వ్యక్తి ఆయనే అన్న భావన చాలామందిలో ఉంది. మొత్తంగా చెప్పాలంటే, ఈ మల్టీస్టారర్ ప్రాజెక్ట్ పై క్లారిటీ వచ్చేసినట్టే కనిపిస్తోంది. త్వరలో అధికారిక ప్రకటన వెలువడితే, ఇది ఇండియన్ సినిమా చరిత్రలోనే ఒక మైలు రాయిగా నిలిచిపోవడం ఖాయం.