ఎన్టీఆర్ ఫ్యాన్ కు అండగా నిలిచినా బెల్లంకొండ, మనోజ్.. ఈ హీరోలు గ్రేట్!
ఈ క్లిష్ట సమయంలో, ఒకే ఒక్క ఆశతో తన బాధను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కొంతమంది నెటిజన్లు స్పందించి ఆర్థిక సాయం చేసినప్పటికీ, చికిత్స కోసం ఇంకా రెండు లక్షల రూపాయల వరకు అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. 'మిమ్మల్ని నా కుటుంబ సభ్యుల్లా భావిస్తున్నాను, దయచేసి సాయం చేయండి' అంటూ ఆయన విజ్ఞప్తి చేశారు.
సోమేశ్ చేసిన ఈ పోస్ట్‌కు సినీ ప్రముఖులు కూడా వెంటనే స్పందించారు. నటుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ వెంటనే స్పందిస్తూ, తాను 'కిష్కిందాపురి' సినిమా ప్రమోషన్స్ కోసం విజయవాడ వస్తున్నానని, నేరుగా ఆయన్ను కలిసి సహాయం చేస్తానని హామీ ఇచ్చారు. అలాగే, మరో నటుడు మంచు మనోజ్ కూడా సోమేశ్కు ధైర్యం చెబుతూ, "నీ నంబర్ పంపు తమ్ముడు... ధైర్యంగా ఉండు... మేమంతా మీతో ఉన్నాం" అని ట్వీట్ చేశారు.
జూనియర్ ఎన్టీఆర్ అభిమాని కష్టంలో ఉన్నప్పుడు బెల్లంకొండ శ్రీనివాస్, మంచు మనోజ్ అండగా నిలబడటంపై నెటిజన్ల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. వీరి మానవత్వం ఎంతో గొప్పదని కొనియాడుతున్నారు. మరోవైపు, సోమేశ్ పోస్ట్ చూసిన తారక్ అభిమానులు సైతం చలించిపోయి, తమ వంతు ఆర్థిక సాయం చేస్తూ తమ మంచి మనస్సును చాటుకుంటున్నారు.
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు