ఏంటి డ్రగ్స్ కేసులో ప్రభాస్ మరదలు ఇరుక్కుందా ? ఇంతకీ ప్రభాస్ మరదలు ఎవరు? డ్రగ్స్ కేసులో ఇరుక్కోవడం ఏంటి? అని చాలామందికి కన్ఫ్యూజన్ గా ఉంటుంది. మరి డ్రగ్స్ కేసులో ఇరుక్కున్న ప్రభాస్ మరదలు ఎవరయ్యా అంటే నటి సంజనా గల్రాని.. సంజనా గల్రానికి ప్రభాస్ కి మధ్య రిలేషన్ ఎక్కడిది అని మీకు డౌట్ రావచ్చు..అయితే ప్రభాస్ త్రిష కాంబినేషన్లో వచ్చిన బుజ్జిగాడు సినిమాలో త్రిష చెల్లెలి పాత్రలో సంజనా గల్రాని నటించింది. అలా త్రిష కి చెల్లెలు అంటే ప్రభాస్ కి మరదలు అనే కదా అర్థం.. అయితే బుజ్జిగాడు సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన సంజనా గల్రాని ఆ తర్వాత సోగ్గాడు, పోలీస్ పోలీస్, సత్యమేవ జయతే,లవ్ యూ బంగారం వంటి సినిమాల్లో నటించింది.
కేవలం తెలుగులోనే కాకుండా కన్నడ,మలయాళ, తమిళ భాషల్లో కూడా రాణించి హీరోయిన్ గా గుర్తింపు సంపాదించింది. ఇక సంజనా గల్రాని చెల్లెలు నిక్కీ గల్రాని కూడా అందరికీ సుపరిచితమే. అయితే అలాంటి సంజనా గల్రాని తాజాగా తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 షోలోకి కంటెస్టెంట్ గా వచ్చిన సంగతి మనకు తెలిసిందే.ఈ నేపథ్యంలోనే తన గురించి ఒక షాకింగ్ విషయాన్ని బయట పెట్టింది.సంజనా గల్రాని ఆ మధ్య కాలంలో డ్రగ్స్ కేసులో ఇరుక్కున్న సంగతి మనకు తెలిసిందే.అయితే ఈ విషయం గురించి సంజనా మాట్లాడుతూ.. డ్రగ్స్ కేసులో నన్ను కావాలనే ఇరికించారు. విచారణ కోసం అని పిలిచి చివరికి అరెస్టు చేశారు. కానీ నేను ఏ తప్పు చేయలేదు. అందుకే ఎక్కడ కూడా భయపడలేదు.
అలాగే నేను డ్రగ్స్ ని తీసుకోలేదు అని హైకోర్టు నాకు క్లీన్ చిట్ ఇచ్చింది.కానీ అప్పటికే చాలామంది నా గురించి దుష్ప్రచారం చేశారు. ఎన్నో మీడియా ఛానల్స్ లో నేను డ్రగ్స్ తీసుకున్నట్టు రూమర్లు క్రియేట్ చేశారు. ఒక్కొక్కరు ఒక్కో విధంగా రాశారు.అయితే నా మీద పడ్డ ఈ మచ్చ హైకోర్టు చెరిపి వేసినప్పటికీ జనాల్లో మాత్రం అలాగే ఉంది. ఆ సమయంలో నాకు చావెందుకు రావడం లేదని చాలా డిప్రెషన్ లోకి వెళ్లి బాధపడ్డాను. ఆ తర్వాత తప్పు చేయనప్పుడు ఎవరికెందుకు భయపడాలి అని నన్ను నేను నిరూపించుకోవడం కోసం ఈ బిగ్ బాస్ షో కి వచ్చాను అంటూ సంజనా గల్రాని చెప్పుకొచ్చింది.ఇక సంజనా గల్రాని డ్రగ్స్ కేసులో ఇరుక్కున్న సమయంలో ఓ హీరో కావాలనే ఆమెను ఇరికించినట్టు రూమర్లు వినిపించాయి.