అనుష్క ఆఖరి హిట్ కి రెండేళ్లు.. అప్పుడు ఏకంగా అన్ని కోట్ల లాభాలతో సత్తా చాటింది..?

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్లలో ఒకరు అయినటువంటి అనుష్క శెట్టి తాజాగా ఘాటి అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. కానీ ఈ సినిమా విజయాన్ని అందుకునే అవకాశాలు కనబడడం లేదు. ఇక అనుష్క ఆఖరుగా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి అనే సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. ఈ మూవీ లో నవీన్ పోలిశెట్టి హీరో గా నటించాడు. ఈ మూవీ 2023 వ సంవత్సరం సెప్టెంబర్ 7 వ తేదీన విడుదల అయింది. ఈ సినిమా ఆ సమయం లో మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా విడుదల అయ్యి నేటితో రెండు సంవత్సరాలు కంప్లీట్ అయింది. ఆ సందర్భంగా ఈ సినిమా ఆ సమయంలో ఎన్ని కోట్ల కలెక్షన్లు వసూలు చేసి ఏ స్థాయి విజయాన్ని అందుకుంది అనే వివరాలను తెలుసుకుందాం.

టోటల్ బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ఈ మూవీ కి నైజాం ఏరియాలో 7.35 కోట్ల కలెక్షన్లు దక్కగా , సీడెడ్ ఏరియాలో 1.35 కోట్లు ,  ఉత్తరాంధ్రలో 1.40 కోట్లు , ఈస్ట్ లో 83 లక్షలు , వెస్ట్ లో 72 లక్షలు , గుంటూరు లో 94 లక్షలు , కృష్ణ లో 94 లక్షలు , నెల్లూరు లో 77 లక్షల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 14.30 కోట్ల షేర్ ... 25.75 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఇక ఈ మూవీ కి కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో కలుపుకొని 1.85 కోట్ల కలెక్షన్లు దక్కగా ఓవర్సీస్ లో 8.25 కోట్ల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాకి 24.20 కోట్ల షేర్ ... 48.05 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 12.50 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరగగా ... ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా 13.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్సా ఫీస్ బరిలోకి దిగింది. ఈ సినిమా టోటల్ బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ప్రపంచ వ్యాప్తంగా 24.40 కోట్ల షేర్ కలెక్షన్లు వసూలు చేయడంతో ఈ మూవీ 10.90 కోట్ల లాభాలను అందుకొని అదిరిపోయే రేంజ్ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: