ఆంధ్ర కింగ్ తాలూకా కోసం మరో డేరింగ్ స్టెప్ తీసుకున్న రామ్.. ఈసారి కూడా సక్సెస్ అయ్యేనా..?

Pulgam Srinivas
ఈ మధ్య కాలంలో మన హీరోలు కేవలం నటించి ప్రేక్షకులను ఆకట్టుకోవడం మాత్రమే కాకుండా తమలో ఉన్న మరికొన్ని టాలెంట్లను కూడా బయట పెట్టి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నారు. ఇకపోతే రామ్ పోతినేని కూడా కేవలం నటించి ప్రేక్షకులను ఆకట్టుకోవడం మాత్రమే కాకుండా తనలో ఉన్న కొన్ని టాలెంట్లను బయట పెట్టి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాడు. రామ్ పోతినేని ఇప్పటివరకు ఎన్నో సినిమాలలో నటించి తన నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం ఈయన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి మూవీ దర్శకుడు అయినటువంటి మహేష్ బాబు దర్శకత్వంలో రూపొందుతున్న ఆంధ్ర కింగ్ తాలూకా అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. మోస్ట్ బ్యూటిఫుల్ నటిమణి భాగ్య శ్రీ బోర్స్ ఈ మూవీ లో రామ్ కి జోడి గా కనిపించబోతుంది.


ఈ మూవీ లో ఉపేంద్ర కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ మూవీ నుండి ఇప్పటికే మేకర్స్ మొదటి అంగ్ ను విడుదల చేసిన విషయం మన అందరికి తెలిసిందే. ఆ సాంగ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఈ సాంగ్ కోసం రామ్ రైటర్ గా మారాడు. ఈ సాంగ్ కి సంబంధించిన లిరిక్స్ రాశాడు. ఇక ఆ లిరిక్స్ కి కూడా ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభిస్తుంది. ఈ సినిమా నుండి సెప్టెంబర్ 8 వ తేదీన పప్పీ షేమ్ అనే సాంగ్ ను విడుదల చేయనున్నారు.


ఇక ఈ సాంగ్ కోసం రామ్ సింగర్ గా మారినట్లు తెలుస్తోంది. ఈ సాంగ్ ఆయనే స్వయంగా పాడినట్లు సమాచారం. మరి ఇప్పటికే లిరిక్ రైటర్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న రామ్ సింగర్ గా ఏ స్థాయి గుర్తింపును  దక్కించుకుంటాడో చూడాలి. ఈ మధ్య కాలంలో రామ్ నటించిన చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. ఇక రామ్ నటించిన చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర వరుసగా ఫెయిల్యూర్ అయిన ఆంధ్ర కింగ్ తాలూకా మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. మరి ఈ సినిమా ఏ స్థాయి విజయాన్ని సొంతం చేసుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: