కూతురి కోసం తర్వాతే సినిమా విషయంలో అలాంటి నిర్ణయం తీసుకున్న ఆలియా.. ఏ జోనర్ చేయనుందో తెలుసా..?

Pulgam Srinivas
బాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్లలో ఒకరిగా కెరియర్ను కొనసాగిస్తున్న వారిలో ఆలియా భట్ ఒకరు. ఈ ముద్దుగుమ్మ చాలా సంవత్సరాల క్రితం హిందీ సినీ పరిశ్రమలో నటిగా కెరియర్ను మొదలు పెట్టింది. ఈమె హీరోయిన్గా కెరియర్ను మొదలు పెట్టిన కొత్త లోనే మంచి విజయాలను అందుకుంటూ వచ్చింది. దానితో చాలా తక్కువ సమయం లోనే ఈమె బాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ స్థాయికి చేరుకుంది. ప్రస్తుతం కూడా ఈమె వరుస సినిమాల్లో నటిస్తూ అద్భుతమైన జోష్లో కెరియర్ను ముందుకు సాగిస్తోంది. కొంత కాలం క్రితం ఈమె రామ్ చరణ్ , జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్ ఆర్ ఆర్ అనే సినిమాలో రామ్ చరణ్ కి జోడిగా నటించింది.


ఈ మూవీ అద్భుతమైన విజయం సాధించడం , ఇందులో ఆలియా తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ సినిమా ద్వారా ఈమెకు తెలుగు సినీ పరిశ్రమలో కూడా మంచి గుర్తింపు వచ్చింది. ఇకపోతే ఈమె బాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి రన్బీర్ కపూర్ ని పెళ్లి చేసుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. వీరిద్దరి జంటకు ఒక పాప కూడా ఉంది. తాజాగా ఆలియా తన పాప ను ఉద్దేశించి తన తదుపరి మూవీ లకు సంబంధించి ఒక అప్డేట్ ఇచ్చింది. తాజాగా ఆలియా మాట్లాడుతూ ... నేను రాబోయే రోజుల్లో నా కూతురు చూసే జోనర్ సినిమాలలో నటించాలి అనుకుంటున్నట్లు చెప్పింది.


ఇప్పటివరకు తన కూతురు చూసే విధంగా ఉన్న సినిమాల్లో తాను నటించలేదు అని , రాబోయే రోజుల్లో తన కూతురు చూసే విధంగా ఉండే సినిమాల్లో నటించాలి అనే ఆలోచనకు వచ్చినట్లు , అందులో భాగంగా కామెడీ జోనర్ కు సంబంధించిన ప్రాజెక్టులను ఓకే చేయాలి అనే ఆలోచనలో ఉన్నట్లు ఆమె చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: