మొదలైన మీరాయ్ సందడి.. అక్కడ బుకింగ్స్ కూడా ఓపెన్..?

Pulgam Srinivas
తెలుగు సినీ పరిశ్రమలో మంచి క్రేజ్ కలిగిన యువ నటులలో ఒకరు అయినటువంటి తేజ సజ్జ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన చిన్న వయసు నుండే సినిమాల్లో నటిస్తూ వస్తున్నాడు. ఈయన చిన్న తనంలో చైల్డ్ ఆర్టిస్టు గా నటించిన ఎన్నో సినిమాలు బాక్సా ఫీస్ దగ్గర మంచి విజయాలను అందుకున్నాయి. ఈయన చిన్న వయసు నుండే తన నటన తో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈయన సినిమాల్లో హీరో గా నటిస్తూ వస్తున్నాడు. అందులో భాగంగా ఈయన ఆఖరుగా హనుమాన్ అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ అదిరిపోయే రేంజ్ బ్లాక్ బాస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది.


ఈ మూవీ తో ఇండియా వ్యాప్తంగా తేజకు గుర్తు వచ్చింది. హనుమాన్ లాంటి అద్భుతమైన విజయం తర్వాత తేజ , కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందిన మిరాయ్ అనే సినిమాలో హీరో గా నటించాడు. మంచు మనోజ్ ఈ మూవీ లో విలన్ పాత్రలో నటించాడు. ఈ సినిమాను సెప్టెంబర్ 12 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా అనేక భాషలలో విడుదల చేయనున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన టికెట్ బుకింగ్స్ నార్త్ అమెరికాలో ఓపెన్ అయ్యాయి.
 


తాజాగా ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా ఈ మూవీ బృందం వారు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ను విడుదల చేశారు. మరి నార్త్ అమెరికాలో ఈ మూవీ టికెట్ బుకింగ్ లకి ప్రేక్షకుల నుండి ఏ స్థాయి రెస్పాన్స్ లభిస్తుందో చూడాలి. ఈ మూవీ యొక్క నార్త్ అమెరికా ప్రీమియర్స్ ను సెప్టెంబర్ 11 వ తేదీనే ప్రదర్శించనున్నారు. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా ఇప్పటికే వెలవడింది. ప్రస్తుతానికి ఈ మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. మరి ఈ సినిమా ఎలాంటి టాక్ ను తెచ్చుకొని ఏ స్థాయి కలెక్షన్లను వసూలు చేస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: